India Pakistan War: భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శుక్రవారం పాక్ డోన్ దాడికి ప్రతీకారంగా భారత్, పాకిస్తాన్‌లో కీలక ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి టార్గెట్ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న పలు ఎయిర్ బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది. శనివారం తెల్లవారుజాము నుంచి లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్ కోట్, నర్వాల్ ఇలా పాక్ ప్రతీ నగరం కూడా దాడులతో దద్దరిల్లింది.
Read Also: Operation Sindoor: పాక్ వ్యాప్తంగా భారత్ విధ్వంసం.. ఎయిర్ స్పేస్ మూసివేత..
ఇదిలా ఉంటే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కాల్పులను తీవ్రం చేసింది. వీటికి ధీటుగా ఇండియా స్పందించింది. పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి ప్రయోగించిన క్షిపణిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. ఉదంపూర్, పఠాన్ కోట్, జమ్మూ, శ్రీనగర్ టార్గెట్‌గా పాక్ ప్రయోగించిన అన్ని మిస్సైళ్లను భారత్ నాశనం చేసింది.
