NTV Telugu Site icon

Waqf Bill: వక్ఫ్ బిల్లు సవరణను నిర్వీర్యం చేయడానికి పాకిస్తాన్, చైనా కుట్ర..?

Waqf

Waqf

Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి అందిన 1.25 కోట్ల సమర్పణలపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కోరారు. దీని వెనక వాంటెడ్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌, పాకిస్తాన్ ఐఎస్ఐ, చైనాల పాత్ర ఉందని అతడు అనుమానించారు. ఈ సందర్భంగా జేపీసీ చైర్మన్ కు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్యానెల్‌కు వచ్చిన ఈమెయిల్స్ పై తక్షణమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో దర్యాప్తు చేయాలని కోరారు. విదేశీ సంస్థలు, వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను తారుమారు చేయడానికి ప్రతిస్పందనల వరదను సృష్టించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పేర్కొన్నారు.

Read Also: AP and Karnataka: ఆరు అంశాలపై ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వెల్లడి..

అయితే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. తాము ఊహించిన రీతిలోనే ప్రతిస్పందనలు వచ్చాయని తెలిపింది. ఎన్డీయే ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని మార్చాలని ప్రతిపాదించడంతో విపక్షాలు ఆందోళన తీవ్ర తరం చేయడంతో.. ఆగస్టులో జేపీసీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదాస్పద అంశానికి సంబంధించి ప్రజలు, ఎన్జీఓలు, నిపుణులతో పాటు ఇతరుల నుంచి పార్లమెంటరీ ప్యానెల్‌కు ( 4.85 ) కోట్ల ఇమెయిల్‌లు వచ్చాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వెల్లడించింది.

Read Also: Ponnam Prabhakar: ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్.. మొదటి అభ్యర్థన స్వీకరించిన మంత్రి పొన్నం

కాగా, మోడీ సర్కార్ జూలై 28న పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు, ముస్లిం మహిళలను చేర్చాలని ప్రతిపాదించింది. ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించే అధికారాన్ని బోర్డు నుంచి తొలగించింది. అయితే, దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈ బిల్లును బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో ఆగస్టు 8న జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో ఈ అంశంపై ప్రజలు తమ అభిప్రాయాలను సమర్పించాలని జేపీసీ కోరింది.