Site icon NTV Telugu

India Pakistan: పాకిస్తాన్ ‘‘ఫేక్ ప్రచారం’’ కొనసాగుతోంది.. వీడియో గేమ్‌ని కూడా వదలడం లేదు..

India Pakistan

India Pakistan

India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.

* భారత్ పంపించిన 25 నుంచి 29 డ్రోన్లను కూల్చినట్లు ప్రముఖ పాక్ ఛానెల్ జియో న్యూస్ చెప్పింది. నిజానికి దీనికి సంబంధించిన ఒక్క రుజువును కూడా చూపించలేదు. నిజం ఏంటంటే, భారత్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని, భారత్‌పైకి ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులను కూల్చేయడం.

* పాకిస్తాన్ సైన్యం అమాయకులైన భారతీయ పౌరులపై దాడులు నిర్వహించింది. ఎల్ఓసీ వద్ద గ్రామాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో 16 మంది సాధారణ పౌరులు మరణించారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తాము భారత సైన్యానికి చెందిన 50 మందిని చంపినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటోంది.

* నిజానికి ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాకిస్తాన్‌లోని 9 ప్రాంతాల్లో 24 దాడులు నిర్వహించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలను, శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే, ఈ విషయాన్ని ఒక్క పాకిస్తాన్ మీడియా కూడా వెల్లడించలేదు. వీటిని పౌర మరణాలుగా చెప్పింది.

* ఈరోజు తెల్లవారుజామున, భారీ MLRS (మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్) బ్యారేజీని భారతదేశంపై నిజమైన పాకిస్తాన్ దాడిగా చూపించే తప్పుడు వీడియోను షేర్ చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకారం, ఈ ఫుటేజ్ ఒక వీడియో గేమ్ నుండి తీసుకోబడింది మరియు మూడు సంవత్సరాలకు పైగా ఆన్‌లైన్‌లో ఉంది. అమృత్‌సర్‌పై దాడి చేశామని పాక్ మీడియా, ఎస్ఎం తప్పుడు కథనాలను సృష్టించింది.

* పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా.. శ్రీనగర్‌లోని భారత వైమానిక స్థావరంపై పాక్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసిందని తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. నిజానికి అలాంటి దాడే జరగలేదు. దాడి చేయడానికి వచ్చిన పాక్ డ్రోన్లు,క్షిపణుల్ని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నామరూపాలు లేకుండా చేసింది.

Exit mobile version