Punjab: పంజాబ్ జలంధర్‌లోని బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా నివాసం వెలుపల జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ కేసును 12 గంటల్లో ఛేదించామని పోలీసులు వెల్లడించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ‘‘పెద్ద కుట్ర’’ జరిగిందని పంజాబ్ పోలీసులు తెలిపారు.