Sikh Referendum: సిక్కు వేర్పాటువాదులతో పాకిస్తాన్ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani diplomat meeting with Sikh separatists: పాకిస్తాన్ తన తీరును మార్చుకోవడం లేదు. భారతదేశాన్ని ఇరుకున పెట్టే ప్రతీ విషయంలో భాగమవుతోంది. కెనడా కేంద్రంగా సిక్కు వేర్పాటువాదులు సిక్క రిఫరెండం ఏర్పాటు చేసిన రోజునే.. పాకిస్తాన్ అధికారులు పలువురు వేర్పాటువాద నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. కెనడాలోని కాన్సుల్ జనరల్ జన్‌బాజ్ ఖాన్ వాంకోవర్ నగరంలోని సర్రేలోని రెండు ఖలిస్తానీ అనుకూల గురుద్వారాలను సందర్శించారు. పాకిస్తాన్ వరద సహాయం కోసం విరాళాలు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే పాక్ అసలు ఎజెండా మాత్రం వేరేలా ఉంది.
ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్న శ్రీ దశమేష్ దర్బార్, గురునానక్ సిక్కు గురుద్వారాలను సందర్శించారు పాక్ అధికారులు. వేర్పాటువాద నేతలో రహస్యంగా సమావేశం అయ్యారు. గురునానన్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ అని స్నేహితులు చేతనే ఈ దశమేష్ దర్బార్ గురుద్వారా నిర్వహించబడుతోంది. నిజ్జర్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ వ్యక్తి. అతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. నాలుగు ఎన్ఐఏ కేసుల్లో ఇతడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. నిజ్జర్ గతంలో ఓ హిందూ పురోహితుడిని చంపేందుకు ప్రయత్నించాడు.
Also Read
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- ECI: "ఆ వార్త నమ్మొద్దు".. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
- CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
Read Also: Funds for Bhanzu: ‘ప్రపంచంలోనే ఫాస్ట్ హ్యూమన్ క్యాలికులేటర్’ భాను సంస్థకి రూ.115 కోట్ల ఫండ్స్
కెనడాలోని జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవిస్తుందని ప్రకటించినప్పటికీ.. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల సిక్కువేర్పాటువాదులు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్ తో పాటు, యూఎస్ లో ఉంటున్న వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పంజాబ్ ప్రత్యేక దేశం కావాలంటూ.. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ సిక్కు ఉగ్రవాదులకు పాకిస్తాన్ లాహెర్ లో ఆశ్రయం ఇస్తోంది. వేర్పాటువాదం వెనక పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఉంది.
సిక్కు రిఫరెండంపై గురువారం కెనడాకు భారత్ తన నిరసనను తెలియజేసింది. మిత్రదేశం కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. అలాగే కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
-
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
-
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!