Site icon NTV Telugu

India-Pakistan: యుద్ధం ఏదైనా భారత్‌ చేతిలో పాక్ ఓటమి తప్పదు: మాజీ అమెరికా అధికారి.

India Vs Pak

India Vs Pak

India-Pakistan: అమెరికా నిఘా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాజీ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తప్పకుండా ప్రకంపనలు సృష్టిస్తాయి. 2001 పార్లమెంట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్‌లు యుద్ధానికి దిగుతాయని సీఐఏ విశ్వసించిందని జాన్ కిరియాకౌ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో ఆసక్తికర విషయాలు.. వీటి వల్లే మంటలు..!

భారతదేశంలో యుద్ధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పాకిస్తాన్ ఒక నిర్ణయానికి రావాలని మాజీ సీఐఏ అధికారి పేర్కొన్నారు. ‘‘భారత్-పాక్ మధ్య నిజమైన యుద్ధం మంచిది కాదు. ఎందుకంటే పాకిస్తానీలు ఓడిపోతారు. నేను అణ్వాయుధ యుద్ధం గురించి మాట్లాడటం లేదు. సంప్రదాయ యుద్ధం గురించి చెబుతున్నా. నిరంతరం భారతీయుల్ని రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని ఆయన అన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలకోట్ దాడులు, ఈ ఏడాది ఏప్రిల్‌లో 26 మంది అమాయకులను బలిగొన్న పహల్గామ్ దాడి తర్వాత జరిపిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ.. భారత్ ఉగ్రవాదంపై నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని కొనియాడారు.

2001లో పార్లమెంట్ దాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్ ఉచ్ఛస్థితిలో ఉందని, ఆ సమయంలో భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తుందని 2002లో అమెరికా ఊహించిందని, ఇస్లామాబాద్ నుంచి తమ పౌరుల్ని తరలించినట్లు కిరియాకౌ చెప్పారు. తాను పాకిస్తాన్ లో పదవీకాలంలో ఉన్నప్పుడు, సీఐఏ అల్‌ఖైదా, ఆఫ్ఘనిస్తాన్‌పై దృష్టిసారించిందని, భారత్ ఆందోళనల్ని పట్టించుకోలేదని చెప్పారు.

Exit mobile version