Site icon NTV Telugu

Pakistan: ఇస్లామాబాద్‌లో సైరన్ చప్పుళ్లు.. లాహోర్ విడిచిపెట్టాలని యూఎస్ ఆదేశాలు..

Paki

Paki

Pakistan: భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని పాకిస్తాన్ వెన్నులో వణుకుపుడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్‌లోని 15 నగరాలపై దాడి చేసేందుకు యత్నించింది. దీనిని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకుని దాయాది దాడిని భగ్నం చేసింది. మరోవైపు, కౌంటర్ అటాక్‌గా భారత్, లాహోర్‌లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని సర్వనాశనం చేసింది. గురువారం ఉదయం లాహోర్ కంటోన్మెంట్‌కి సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయిల్ తయారీ హార్పి డ్రోన్స్ పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థని నాశనం చేశాయి.

Read Also: S-400 Sudarshan Chakra: భారత్‌ని రక్షించిన “S-400 సుదర్శన చక్ర”.. పాక్ క్షిపణి దాడి భగ్నం..

ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. పాక్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏం చేయాలో తెలియక లాహోర్, కరాచీ, సియాల్‌కోట్ ఎయిర్ పోర్టుల్ని మూసేసింది. మరోవైపు, రాజధాని ఇస్లామాబాద్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉంటే, లాహోర్‌ని వెంటనే విడిచి వెళ్లాలని అమెరికా తన ప్రజలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ దాడులు ఇందుకు కారణమని తెలుస్తోంది. లాహోర్ ప్రధాన ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ప్రజల్ని పాక్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారనే సమాచారం కూడా పాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అందింది. లాహోర్‌లో ఉన్న అమెరికన్లు వెంటనే నగరాన్ని విడిచివెళ్లాలని, సాధ్యం కాకపోతే షెల్టర్ లో ఉండాలని ఆదేశించింది.

Exit mobile version