Yogi Adityanath: ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పీఓకే కలుస్తుంది..
- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
- కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. పీఓకేను భారత్‌లో విలీనం చేస్తాం..
- పాకిస్తాన్ తన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది: ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తామని ప్రకటించారు. జమ్మూలోని ఆర్ఎస్ పురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ తన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోందన్నారు. అలాగే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు.
Read Also: Eatala Rajendar: బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అన్నట్టుంది.. హైడ్రా నోటీస్ ల పై ఈటల సెటైర్లు..
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్‌లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
కాగా, పాకిస్థాన్ లో పెరుగుతున్న ఆహార ధరలు, పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు సైతం భారత్ లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. ఇక, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌లో కూడా ఎన్నికలు నిర్వహిస్తే.. అది సానుకూల సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆరు నెలల్లో భారత్‌లో భాగమవుతుందని ఆ సమయంలో తాను చెప్పినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు.
Read Also: China Disruption : చైనా వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి..!?
అయితే, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తైంది. మరో 40 స్థానాలకు మూడో దశలో అక్టోబర్ 1వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అక్టోబరు 8వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుది ఫలితాలు వెలువడనున్నాయి.
— Yogi Adityanath (@myogiadityanath) September 26, 2024
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!