Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- టర్కీ, సౌదీలతో ‘‘మక్కా ఒప్పందం’’ పాకిస్తాన్‌ను కాపాడుతుందా.?
- గతంలో బాగ్దాద్ ఒప్పందం ఉన్నా భారత్ చేతిలో ఘోర పరాజయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్-టర్కీ-సౌదీ అరేబియాలు కలిసి ఒక రక్షణ ఒప్పందాన్ని కుదర్చుకున్నాయి. ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’పై సంతకాలు చేశాయి. ఈ కూటమి భారత్‌కు తలనొప్పిగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. అయితే, గతంలో ఇలాంటిదే పాకిస్తాన్ ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కుదుర్చుకుంది. కానీ 1965 యుద్ధంలో భారత్ నుంచి పాకిస్తాన్‌ను కాపాడటానికి ఏ మిత్ర దేశం కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’గా చెప్పబడుతున్న ఈ తాజా ఒప్పందం కూడా పాకిస్తాన్‌కు రక్షణ ఇవ్వలేదని చాలా మంది చెబుతున్నారు.
బాగ్దాద్ ఒప్పందం:
మధ్యప్రాచ్యంలో సోవియట్ యూనియన్ ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా, పాశ్చాత్య దేశాలు భావించాయి. చమురు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో సోవియట్ ప్రభావం పెరిగితే తమకు సమస్యలు ఎదురవుతాయని వెస్ట్రన్ దేశాలు భావించాయి. ఈ నేపథ్యంలోనే 1955లో ఇరాక్, టర్కీ, ఇరాన్, పాకిస్తాన్ మరియు బ్రిటన్ దేశాలు బాగ్దాద్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. బాగ్దాద్‌లో ఈ రక్షణ ఒప్పందం కుదరడంతో దానికి ‘‘బాగ్దాద్ ఒప్పందం’’గా పేరు వచ్చింది. ఆ తర్వాత 1959లో దీని నుంచి ఇరాన్ వైదొలిగింది. దీంతో దాని పేరు సెంటో(CENTO) లేదా సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (Centy Treaty Organization)గా మార్చారు.
Also Read
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
పాక్ ఉద్దేశం వేరు, కానీ..
ఆ సమయంలో సోవియట్ రష్యా నుంచి పాకిస్తాన్‌కు ఏ ముప్పు లేదు. పాక్ అమెరికా వైపు ఉండేది. భారత్‌తో సమానత్వం సాధించాలనే తపనతో పాకిస్తాన్ పలు దేశాలతో సంబంధాలు, ఒప్పందాలు చేసుకుంది. దీని ద్వారా భారత్‌పై పైచేయి సాధించాలని భావించింది. ఇదే తరహాలో పాకిస్తాన్ SEATOలో కూడా చేరింది. ఇది పాకిస్తాన్ సైన్యాన్ని వేగంగా ఆధునికీకరించింది. ఈ సైనిక శక్తిని చూసుకుని భారత్‌పై గెలువొచ్చనే భ్రమతో యుద్ధానికి దిగింది. ఇదే సమయంలో భారత్ సోవియట్ రష్యాకు మిత్రదేశంగా ఉండేది.
పాకిస్తాన్ అమెరికా ఆయుధాలను భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని భావించింది. మరోవైపు, అమెరికా ఉద్దేశ్యాలు వేరుగా ఉన్నాయి. పాకిస్తాన్ గడ్డను ఉపయోగించుకుని రష్యా, చైనాలను నిలువరించొచ్చని అమెరికా అనుకుంది.
1965లో పాకిస్తాన్ ఓటమి, కాపాడని ఒప్పందాలు:
1962 చైనా యుద్ధం తర్వాత భారత బలం క్షీణించిందని భావించిన పాకిస్తాన్, భారత్‌పై దుస్సాహసానికి ఒడిగట్టింది. ఈ యుద్ధంతో తనకు మిత్రదేశాలు సాయం చేస్తాయని అనుకుంది. కానీ సెంటో సభ్యదేశాలు పాకిస్తాన్‌కు సహాయం చేయలేదు. అమెరికా రెండు దేశాలకు ఆయుధాల సరఫరా ఆపేసింది. టర్కీ, ఇరాన్‌లు పాక్‌కు నైతిక మద్దతు ఇచ్చాయి. కానీ సైనిక సాయం అందించలేదు. ఈ యుద్ధంలో పాక్ ఘోరంగా ఓడిపోయింది.
దీని తర్వాత 1971 బంగ్లా విముక్తి పోరాటం కోసం జరిగిన యుద్ధంలో కూడా భారత్ నుంచి పాకిస్తాన్‌ను ఏ దేశం కాపాడలేకపోయింది. పాకిస్తాన్ సాయం కోసం సెంటో దేశాలను అభ్యర్థించింది. భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా తన సెవెంట్ ఫ్లీట్‌కు చెందిన యూఎస్ఎస్ ఎంటర్ఫ్రైజ్ అనే నౌకను బంగాళాఖాతం వైపు పంపింది. కానీ రష్యా భారత్ పక్షాన ఉండటంతో యూఎస్ ఏం చేయలేకపోయింది. ఆ సమయంలో కూడా పాక్‌కు టర్కీ, ఇరాన్ ఇతర ముస్లిం దేశాల నుంచి నైతిక మద్దతు లభించిందే తప్పా, సైనిక సాయం అందలేదు. ఫలితంగా పాక్ ఓడిపోయి, తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా కొత్త దేశంగా ఏర్పడింది.
దీఇది జరిగిన నాలుగేళ్లకు ఇరాన్ విప్లవం తర్వాత షా అధికారాన్ని కోల్పోయిన తర్వాత 1979లో ఇరాన్, పాకిస్తాన్ సెంటో (CENTO) నుండి వైదొలిగాయి. ఇది 1979 మార్చి 16న అధికారికంగా రద్దుగా రద్దైంది. బాగ్దాద్ ఒప్పందం ద్వారా ఏర్పడిన కూటమి దాదాపు 24 ఏళ్ల తర్వాత 1979లో ముగిసింది.
ఇస్లామిక్ నాటో కూడా కాపాడలేదా?
ఇప్పుడు పాకిస్తాన్ టర్కీ, సౌదీ అరేబియాలు కలిసి ఒక రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, ఈ కూటమిలో పాకిస్తాన్ మాత్రమే భారత్‌ను శత్రువగా చూస్తోంది. టర్కీ పాకిస్తాన్‌కు వంత పాడుతోంది. గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో తన డ్రోన్లను ఇచ్చి పాకిస్తాన్‌కు సహాయపడింది. అయితే, సౌదీ అరేబియా భారత్‌కు మిత్రదేశం. ఈ నేపథ్యంలో నిజంగా భారత్‌తో పోరు జరిగితే సైనికంగా టర్కీ, సౌదీలు సహకరిస్తాయా.. అనేది పెద్ద ప్రశ్నగానే ఉంది. ఇక ఈ కూటమిలో ఈజిప్టును కూడా చేర్చుకోవాలని టర్కీ, పాక్ భావిస్తున్నాయి. అయితే, ఇరాన్ సౌదీ దాడులు చేస్తున్నా కూడా పాక్ కాపాడలేదు. చివరకు భారత్ దాడి చేసినా ఈ దేశాలు నేరుగా భారత్‌తో కయ్యానికి వచ్చే పరిస్థితి ఉండదు. కానీ భారత్‌పై ఒకింత మానసిక ఒత్తిడిని తీసుకురావచ్చు.
తాజావార్తలు
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?