BJP MP: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్‌లోని ప్రతీ ప్రాంతంలో ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని ఆయన ఆదివారం అన్నారు. భారతదేశం పట్ల పాకిస్తాన్‌కి భయం ఉందని, భారత్ తమను మళ్లీ విభజిస్తుందనే భయం వారిలో ఉందని అన్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం అప్పుల భారంతో నిండిపోయిందని, ప్రజలు ఆకలితో బాధపడుతుందని ఆయన అన్నారు.
Read Also: Madhya Pradesh: ముస్లింలను జిమ్ లోకి అనుమతించకూడదు.. భోపాల్ ఎస్ఐ కామెంట్స్ వైరల్..
రొట్టెలకు బదులుగా బుల్లెట్ల సంప్రదాయాన్ని అనుసరిస్తున్న పాకిస్తాన్ సైన్యానికి ప్రతీ చోట తిరుగుబాటు జరుగుతోందని దూబే చెప్పారు. బలూచిస్తాన్‌లో హక్కుల కోసం జరిగే పోరాటాన్ని ఇస్లాంకు వ్యతిరేక పోరాటంగా పాకిస్తాన్ చెబుతోందని, తన దేశ పౌరులను భారత ఏజెంట్లుగా పిలుస్తోందని దూబే ఆరోపించారు. ‘‘బలూచిస్తాన్ లో జరిగే అశాంతిని భారత్ ప్రేరేపిస్తోందని, పాకిస్తాన్ ఇస్లామిక్ విశ్వాసం, సార్వభౌమత్వానికి హానికరం’’ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా ఒక లేఖను పంచుకుంది. ఇందులో బలూచిస్తాన్ అశాంతికి భారత్ కారణమని ఆరోపించింది. దీనిని దూబే షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడంపై కూడా దూబే స్పందించారు. ఆయన ఎక్స్ పోస్ట్‌లో ఐఎంఎఫ్ లేదా చైనా,అమెరికా, సౌదీ అరేబియా, టర్కీలు పాకిస్తాన్‌కి ఎంత రుణం ఇచ్చినా, ఆ డబ్బు అంతా కాలువలోకి పోతుందని, పనికిరాని పాకిస్తాన్ అప్పుల భారంతో నశించిపోతుందని ఆయన అన్నారు.
पाकिस्तान क़र्ज़ के बोझ से इतना दब चुका है कि लोग भूख और प्यास से तड़प रहे हैं ।रोटी के बदले गोली के संस्कारों में जाती पाकिस्तानी सेना के ख़िलाफ़ जगह जगह विद्रोह हो गया है ।पाकिस्तान को अपना देश टुकड़ों में बँटता हुआ नज़र आ रहा है,इसलिए बलूचिस्तान के रोटी के लड़ाई को इस्लाम के… pic.twitter.com/KwiC6eRdj1
— Dr Nishikant Dubey (@nishikant_dubey) June 1, 2025