Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
- భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు..
- మరోసారి గగనతల నిషేధం పొడగింపు..
- ఆపరేషన్ సిందూర్ నుంచి ఇరు దేశాలు ఇదే వైఖరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Airspace Ban: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత విమానాలకు గగనతల నిషేధాన్ని పొడగించింది. మరో నెల రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. భారత్‌లో రిజిస్టర్ అయిన విమానాలతో పాటు, భారత విమానయాన సంస్థలకు, ఆ సంస్థలు లీజు తీసుకున్న విమానాలపై ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఇది భారత సైనిక విమానాలకు కూడా వర్తిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకారం.. ఈ ఆంక్షలు 2026 నవంబర్ 24 ఉదయం 5.59 గంటల వరకు అమలులో ఉంటాయి.
ఆపరేషన్ సిందూర్ నుంచి ఎయిర్ స్పేస్ బ్యాన్..
2025 ఏప్రిల్ 23న పాకిస్తాన్ భారత విమానాలపై ఆంక్షలు విధిస్తూ, గగనతల నిషేధాన్ని విధించింది. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని పొడగిస్తూ వస్తోంది. పాకిస్తాన్ తన గగనతలాన్ని కరాచీ, లాహోర్ అనే రెండు ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్లుగా విభజించింది. తాజా నిషేధం ఈ రెండు ప్రాంతాలకు వర్తిస్తుంది.
Also Read
- Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
- Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
- LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
2025లో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని పలు ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత పాక్ సైన్యం భారత్‌పై దాడులు చేయడానికి ప్రయత్నిస్తే, భారత్ క్షిపణులు, వైమానిక దాడులతో పాక్ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. రాడార్ కేంద్రాలు, విమాన హ్యాంగర్లు, రన్ వేలు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని పాకిస్తాన్ పొడగించుకుంటూ వస్తోంది.
పాకిస్తాన్ చర్యలకు ప్రతిస్పందనగా 2025 ఏప్రిల్ 30 నుంచి పాకిస్తాన్ విమానయాన సంస్థలకు కూడా భారత్ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో రెండు దేశాలు పరస్పరం తమ గగనతలాన్ని నిషేధించుకున్నాయి.
అంతర్జాతీయ ప్రయాణాలపై ఎఫెక్ట్..
పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో భారత పౌర విమానయాన రంగంపై ప్రభావం పడుతోంది. యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రంపై నుంచి తిరిగి వెళ్లా్ల్సి వస్తోంది. ఢిల్లీ లాంటి ఉత్తర భారతదేశంలోని ఎయిర్ పోర్టుల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం, ఇంధన ఖర్చులు పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
-
Tesla Roadster: టెస్లా ఫ్లయింగ్ కార్.. భారత్‌లో బుకింగ్స్ ప్రారంభం.. రూ.2.50 కోట్ల వరకు రిజర్వేషన్ అమౌంట్!
-
Horoscope : నవంబర్‌లో అరుదైన ‘మహాలక్ష్మీ రాజయోగం’.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
-
Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
-
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!