Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- భారత విమానాలపై పాక్ నిషేధం పొడగింపు..
- ఆగస్టు 23 వరకు ఎయిర్ స్పేస్ క్లోజ్..
- NOTAM జారీ చేసిన పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ.
- పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరస్పర ఎయిర్‌స్పేస్ ఆంక్షలు అమల్లోనే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత విమానాలకు, సైనిక విమానాలకు విధించిన గగనతల ఆంక్షల్ని పాకిస్తాన్ మరోసారి పొడగించింది. తాజా నిర్ణయం ప్రకారం, భారత రిజిస్ట్రేషన్ కలిగిన విమానాలు, భారత ఎయిర్‌లైన్స్ నిర్వహించే లేదా లీజుకు తీసుకున్న విమానాలు, సైనిక విమానాలకు పాకిస్థాన్ గగనతలం ఆగస్టు 23 రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉండదు. ఈ మేరకు పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM) జారీ చేసింది. గతంలో ఉన్న ఆంక్షలు జూలై 24తో ముగియాల్సి ఉండగా, దానిని మరోసారి పాకిస్తాన్ పొడగించింది.
2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ దాడి అనంతరం భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి పాక్, పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడికి ప్రయత్నించింది. దీనికి ప్రతిగా భారత్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన పలు కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. క్షిపణులు నూర్ ఖాన్ వంటి కీలక పాక్ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
Also Read
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
దీని తర్వాత పాకిస్తాన్, భారత్‌లు ఒకరిపై ఒకరు గగనతల ఆంక్షలు విధించుకున్నాయి. పాకిస్తాన్ తరహాలోనే పాక్ ఎయిర్ లైన్స్ నడుపుతున్న విమానాలు, సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసేసింది. పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేయడం వల్ల భారత విమానాలు అరేబియా సముద్రం మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల అదనపు సమయం, అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రయాణికులపై ఈ భారం పడుతోంది.
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..