India Pakistan: పాక్ ఆర్మీ చేతిలో రాహుల్ గాంధీ, సత్యపాల్ మాలిక్ వీడియో..
- రాహుల్ గాంధీ, సత్యపాల్ మాలిక్ వీడియోని హైలెట్ చేస్తున్న పాక్ ఆర్మీ..
- ఉగ్రవాద దాడుల్లో తమ ప్రమేయం లేదని దాయాది అబద్ధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పాకిస్తాన్ భారతదేశంలో చేస్తు్న్న ఉగ్రవాద దాడుల్ని కవర్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీడియోలను వాడుతోంది. ఇటీవల, పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్నారు. ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కి చెందిన వారని స్పష్టమైంది. అయితే, పాకిస్తాన్ మాత్రం భారత్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపిస్తోంది.
దీనికి ఆధారంగా, 2019లో జరిగి పుల్వామా దాడికి సంబంధించి రాహుల్ గాంధీ, సత్యపాల్ మాలిక్ మాట్లాడిన వీడియోని పాకిస్తాన్ ఆర్మీ కోట్ చేస్తోంది. విదేశీ మీడియాతో ఈ వీడియోని పంచుకుంది. పాక్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్‌పీఆర్ ఈ వీడియోని హైలెట్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయాల కోసం అమాయకులైన కాశ్మీరీలను, ముస్లింలను చంపుతోందని, పాకిస్తాన్‌పై ఆరోపిస్తోందని ఐఎస్‌పీఆర్ డీజీ అహ్మద్ షరీఫ్ చెబుతూ, విదేశీ మీడియాకు ఈ వీడియోని చూపించారు. ఇందులో పాకిస్తాన్ ప్రమేయం ఉందని చెప్పి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌ని ఎన్నికల కోసం కేంద్రం వాడుకుందని సత్యపాల్ మాలిక్ అనడాన్ని పాక్ ఆర్మీ హైలెట్ చేసింది.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
పుల్వామా అటాక్:
ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై 78 బస్సుల్లో దాదాపు 2,500 మంది జవాన్లతో కూడిన CRPF కాన్వాయ్ ప్రయాణిస్తోంది. కాన్వాయ్ పుల్వామా చేరుకున్న కొద్దిసేపటికే బాంబులతో నిండిన ఒక కారు కాన్వాన్‌ని ఢీకొట్టింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు చేసింది.
Shameful but expected!
Pakistan Army is using videos of Rahul Gandhi & Satyapal Malik to blame India for Pulwama!
India will never forgive, never forget!#OperationSindoor pic.twitter.com/IFg3iNjHol
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 9, 2025
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!