Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pak To Give Rs 14 Crore To Masood Azhar Imf Must Rethink Loan Rajnath Singh

Rajnath Singh: మసూద్ అజార్‌కి రూ.14 కోట్లు ఇచ్చింది.. పాక్ టెర్రర్ ప్లాన్‌పై రక్షణమంత్రి వార్నింగ్..

Published Date :May 16, 2025 , 4:36 pm
By Venu Goapl Reddy
  • ఉగ్రవాది మసూద్ అజార్‌కి పాక్ రూ. 14 కోట్లు ఇస్తోంది..
  • ఐఎంఎఫ్ పాక్ రుణంపై మరోసారి ఆలోచించాలి..
  • పాకిస్తాన్ టెర్రర్ ప్లాన్స్‌పై రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక..
Rajnath Singh: మసూద్ అజార్‌కి రూ.14 కోట్లు ఇచ్చింది.. పాక్ టెర్రర్ ప్లాన్‌పై రక్షణమంత్రి వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నాశనం చేసిన ఉగ్రవాద నెట్వర్క్‌ని పాకిస్తాన్ పునర్నిర్మంచడానికి ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక యోధుల తెగువను ఆయన ప్రశంసించారు. భుజ్ వైమానిక స్థావరంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాది అయిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం రూ. 14 కోట్లను ప్రటించిందని, పాకిస్తాన్‌కి రుణం ఇచ్చే అంశాన్ని ఐఎంఎఫ్ పునరాలోచించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు.

‘‘మురిడ్కే, బహవల్పూర్‌లలో ఉన్న లష్కరే తోయిబా (LeT), జైషే-ఏ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఐఎంఎఫ్ నుండి వచ్చే ఒక బిలియన్ డాలర్లలో గణనీయమైన భాగాన్ని ఖచ్చితంగా ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తారు. దీనిని ఐఎంఎఫ్ పరోక్ష నిధులుగా పరిగణించదా?’’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు.

Read Also: Deputy CM: ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. ఎంపీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..

భారత్ మే 09న, భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కి 1బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పినప్పటికీ ఐఎంఎఫ్ వినిపించుకోలేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, భారత్ పాకిస్తార్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లోని బాహవల్పూ్‌ర్‌లోని జైషే మహ్మద్ స్థావరంపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో మసూద్ అజార్‌ కుటుంబ సభ్యులు 10 మంది మరణించారు.

అయితే, ఇటీవల ఉగ్రవాద స్థావరం ఉన్న మురిడ్కే ప్రాంతాన్ని పాకిస్తాన్ మంత్రి రాణా తన్వీర్ హుస్సేన్ సందర్శించారు. ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఈ ప్రాంతాన్ని పునర్నిర్మిస్తుందని చెప్పాడు. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజు తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IMF
  • India-Pakistan War
  • Masood Azhar
  • Operation Sindoor
  • Pakistan

తాజావార్తలు

  • Dacoit Trailer : అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?

  • Pakistan: పాకిస్తాన్‌కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..

  • Raghav chadha: ‘‘నేను గాయపడ్డాను..’’.. ఆప్‌కు ధురంధర్ స్టైల్‌లో రాఘవ్ చద్దా రిప్లై..

  • DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..

  • Andhra Pradesh New Map: అమరావతి రాజధానిగా.. 28 జిల్లాలతో కొత్త మ్యాప్‌..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions