Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు
- జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- సుధా మూర్తి వ్యాఖ్యలకు నెటిజన్లు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చీర కట్టుకున్నందుకు తనను బెహన్జీ అనే వారని.. ఇంగ్లీష్ రాదని.. పెద్దగా పరిజ్ఞానం ఉండదని భావిస్తారని.. అదంతా అబద్ధమని ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్పర్సన్ సుధా మూర్తి అన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ ఐశ్వర్య డీకేఎస్ హెగ్డేతో జరిగిన సంభాషణలో అనేక విషయాలు పంచుకున్నారు. మహిళల తెలివితేటలు, సామర్థ్యాలను వారు ధరించే దుస్తులను బట్టి అంచనా వేయడం సరికాదని స్పష్టం చేశారు. వృత్తిపరమైన సమావేశాల్లో తెలివైనవారిగా, శక్తిమంతులుగా కనిపించాలంటే మహిళలు తప్పనిసరిగా సూట్లు ధరించాలనే భావనను ఆమె ప్రశ్నించారు. “చాలామంది మహిళలు చీరలు ధరించి బోర్డు రూమ్‌లకు రావాలని నేను కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
తాను చీర కట్టుకుని విమానాశ్రయాలకు వెళ్లినప్పుడు కొందరు తనను ‘బెహన్జీ’ అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. చీర ధరించడాన్ని బట్టి తనకు ఇంగ్లీష్ రాదని, తగినంత పరిజ్ఞానం లేదని, ఉన్నత సామాజిక వర్గాల జీవనశైలి గురించి తెలియదని కొందరు భావించేవారని చెప్పారు. ఒక వ్యక్తి తెలివితేటలు, జ్ఞానం అనేవి వారు ధరించే దుస్తులపై ఆధారపడవని స్పష్టం చేశారు. “నా పరిజ్ఞానానికి, నేను ధరించే దుస్తులకు సంబంధం లేదు. చీర ఎప్పుడూ హుందాగా కనిపిస్తుంది. అది మన సంస్కృతిలో చాలా కాలంగా భాగంగా ఉంది” అని పేర్కొన్నారు. కార్పొరేట్ రంగంలో పాశ్చాత్య దుస్తులను అధికారానికి, తెలివితేటలకు చిహ్నంగా చూడటంపై కూడా మాట్లాడారు. సూట్ వేసుకుంటేనే తెలివైనవారిగా కనిపిస్తారనే భావనను సవాలు చేస్తూ.. చీర ధరించినా తాము సమర్థులమేనని మహిళలు నిరూపించగలరని అభిప్రాయపడ్డారు.
Also Read
- BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు'.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
- Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
- CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
ఈ సంభాషణలో ఐశ్వర్య డీకేఎస్ హెగ్డే కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇతర దుస్తులు సరిపోని సందర్భాల్లో తాను తన తల్లి చీరను ధరించి బయటకు వెళ్తానని చెప్పారు. చీర ప్రత్యేకత ఏమిటంటే.. శరీర ఆకారం లేదా దుస్తుల సైజుతో సంబంధం లేకుండా ఎవరైనా ధరించవచ్చని, ఆత్మవిశ్వాసంతో బయటకు వెళ్లవచ్చని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ప్రశంసలు
సుధా మూర్తి వ్యాఖ్యలపై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసలు కురిపించారు. ఆమె సంప్రదాయ దుస్తులను అభినందిస్తూ, భారతీయ సంస్కృతిని గౌరవించడంలో ఆమె చూపిస్తున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. మరో యూజర్ స్పందిస్తూ.. నిజమైన శక్తి దుస్తుల్లో లేదని, మనకు తెలిసిన విషయాలు, మన విలువలు, వాటి కోసం నిలబడే ధైర్యంలో ఉంటుందని పేర్కొన్నారు. ఇంకొంతమంది వ్యక్తులను వారి దుస్తులు, రూపాన్ని బట్టి ఎందుకు అంచనా వేస్తారని ప్రశ్నించారు. మొత్తంగా, సుధా మూర్తి వ్యాఖ్యలు మహిళల దుస్తులు, వృత్తిపరమైన సామర్థ్యాలు, సామాజిక మూసధోరణులపై చర్చకు దారితీశాయి. వ్యక్తి విలువను వారు ధరించే దుస్తులతో కాకుండా.. వారి జ్ఞానం, నైపుణ్యం, వ్యక్తిత్వంతో అంచనా వేయాలనే సందేశాన్ని ఆమె వ్యాఖ్యలు మరోసారి ముందుకు తెచ్చాయి.
- Tags
- Behenji
- Interview
- Sudha Murty
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..