Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ నాశనం చేసిన ఉగ్రవాద నెట్వర్క్‌ని పాకిస్తాన్ పునర్నిర్మంచడానికి ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక యోధుల తెగువను ఆయన ప్రశంసించారు. భుజ్ వైమానిక స్థావరంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాది అయిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం రూ. 14 కోట్లను ప్రటించిందని, పాకిస్తాన్‌కి రుణం ఇచ్చే అంశాన్ని ఐఎంఎఫ్ పునరాలోచించాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు.
‘‘మురిడ్కే, బహవల్పూర్‌లలో ఉన్న లష్కరే తోయిబా (LeT), జైషే-ఏ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఐఎంఎఫ్ నుండి వచ్చే ఒక బిలియన్ డాలర్లలో గణనీయమైన భాగాన్ని ఖచ్చితంగా ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తారు. దీనిని ఐఎంఎఫ్ పరోక్ష నిధులుగా పరిగణించదా?’’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు.
Read Also: Deputy CM: ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. ఎంపీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
భారత్ మే 09న, భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కి 1బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పినప్పటికీ ఐఎంఎఫ్ వినిపించుకోలేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, భారత్ పాకిస్తార్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లోని బాహవల్పూ్‌ర్‌లోని జైషే మహ్మద్ స్థావరంపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మరణించారు.
అయితే, ఇటీవల ఉగ్రవాద స్థావరం ఉన్న మురిడ్కే ప్రాంతాన్ని పాకిస్తాన్ మంత్రి రాణా తన్వీర్ హుస్సేన్ సందర్శించారు. ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఈ ప్రాంతాన్ని పునర్నిర్మిస్తుందని చెప్పాడు. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజు తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
