Site icon NTV Telugu

Pakistan: పాక్ ఆర్మీ, లష్కరే ఉగ్రవాదుల కొత్త కుట్ర.. పీఓకేలో టన్నెల్స్ నిర్మాణం..

Loc

Loc

Pakistan: పాకిస్తాన్ భారత్‌కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘‘ఆపరేషన్ సిందూర్’’తో చావు దెబ్బలు తిన్నా కూడా తన పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని నియంత్రణ రేఖను సందర్శించినట్లు తెలుస్తోంది.

Read Also: Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..

“పాకిస్తాన్ సైన్యం మరియు లష్కరే తోయిబా కమాండర్లు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌లో సమావేశమై ఎల్‌ఓసిని సందర్శిస్తున్నారు. జిహాదీ ఉగ్రవాదులను సరిహద్దు దాటించడానికి పాకిస్తాన్ ఎల్‌ఓసి క్రింద సొరంగం కార్యకలాపాలను పెంచుతోందని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి” అని న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ తహా సిద్ధిఖీ ఒక వీడియోను షేర్ చేస్తూ ఎక్స్‌లో రాశారు. అతను పంచుకున్న క్లిప్‌లో లష్కరే సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాతో పాటు ఉగ్ర సంస్థకు చెందిన అనేక మంది సభ్యులు ఉన్నారు.

అయితే, హమాస్ తరహాలో పాక్ ఉగ్రవాదులు పీఓకేలో సొరంగాల తవ్వకాన్ని వేగవంతం చేసినట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై బీఎస్ఎఫ్, భారత సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది. కొన్ని నివేదిక ప్రకారం, ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడానికి ముందు చొరబాటుదారులు లోతైన భూగర్భ సొరంగాలను ఉపయోగిస్తున్నారని తెలిపాయి. చొరబాటుదారుల్ని, ఉగ్రవాదుల్ని భారత్ ‌లోకి పంపించేందుకు వీటిని ఉపయోగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, భారత్-పాక్ సంఘర్షణల సమయంలో పాక్ ఆర్మీని ఈ సొరంగాల ద్వారా పంపించడానికి వీటిని తవ్విందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version