ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఇంట్లో విషాదం నెలకొంది. రితేష్ తండ్రి రమేష్ అగర్వాల్ మృతి చెందారు. ఈరోజు మధ్యాహ్నం హర్యానాలోని గురుగ్రామ్‌లో ఎత్తైన భవనంపై నుండి పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 54లో DLF యొక్క ది క్రెస్ట్ సొసైటీ 20వ అంతస్తు నుండి పడిపోయారు. ఈ మేరకు DLF సెక్యూరిటీ నుండి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పడిపోయిన వ్యక్తిని రమేష్ పర్సద్ అగర్వాల్‌గా గుర్తించారు. అతడిని పరాస్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టమ్ అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
Also Read: Congress: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం వైఖరేంటి?
కాగా, రమేష్ అగర్వాల్ ఇటీవల తన 29 ఏళ్ల కుమారుడు రితేష్ వివాహంలో కనిపించాడు. రితేష్, గీతాన్షా సూద్ జంట మార్చి 7న ఢిల్లీలోని ఫైవ్ స్టార్ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో హై ప్రొఫైల్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించారు. అయితే, ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరు అయ్యారు.