Asaduddin Owaisi: ‘‘నా టోపీ, గడ్డాన్ని చూసి అలా పిలుస్తావా.?’’ తేజస్వీపై ఓవైసీ ఆగ్రహం..
- తేజస్వీ యాదవ్‌కు ఓవైసీ సవాల్..
- ‘‘ఉగ్రవాది’’ని ఇంగ్లీష్‌లో రాయగలవా..?
- నా టోపీ, గడ్డాన్ని చూసి అలా అంటావా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: బీహార్ ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరు నేతలు ప్రచారాన్ని తీవ్రం చేశారు. తాజాగా, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్, ఓవైసీని ‘‘ఉగ్రవాది’’గా పిలవడం కొత్త వివాదానికి కారణమైంది. దీనిపై ఓవైసీ స్పందిస్తూ.. ‘‘బాబు ఉగ్రవాది(extremist)ని ఇంగ్లీషులో రాయగలరా..?’’ అంటూ సెటైర్లు వేశారు.
Read Also: Chevella Bus Accident: గతంలో ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ దస్తగిరి.. ఈ ప్రమాదంలో మృతి!
Also Read
కిషన్ గంజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ ఓవైసీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అని ఒక ఇంటర్వ్యూలో తేజస్వీ యాదవ్‌ను అడిగారు. ఓవైసీ ఒక ఉగ్రవాది, ఒక మతోన్మాది, ఒక ఉగ్రవాది అని తేజస్వీ అన్నారు. నేను నా మతాన్ని గర్వంగా అనుసరిస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఉగ్రవాది అని పిలుస్తారు’’ అని అడిగారు. ‘‘నీ ముందు వంగి నమస్కరించని వాడిని, అడుక్కోని వాడిని, నీ తండ్రి(లాలూ ప్రసాద్ యాదవ్)కు భయపడిని వాడిని.. నువ్వు అతడిని పిరికి వాడు అంటావా.? నా ముఖం మీద గడ్డ, తలపై టోపీ.. అది నన్ను ఉగ్రవాదిగా చేస్తుందా..? నీలో ఎంత ద్వేషం ఉంది’’ అని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాడు అని ఫైర్ అయ్యారు. తేజస్వీ యాదవ్ పూర్తిగా సీమాంచల్ ప్రాంతాన్ని అవమానించారని అన్నారు.
ఎన్నికల ముందు ఓవైసీ, తేజస్వీతో పొత్తుపై చర్చలు జరిగాయి. ఎంఐఎంకు ఆరు సీట్లు ఇస్తామని ఆర్జేడీ ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి, దీనిని ఎవరూ అంగీకరించలేదు. దీంతో ఎంఐఎం బీహార్‌లోని 243 సీట్లలో 100 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని ప్రణాళిక వేసింది. తాము మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామని ఎంఐఎం ఆశాభావం వ్యక్తం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఐదు సీట్లు సాధించింది. ఆ తర్వాత ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరగా, ఒక వ్యక్తి మరణించారు.
#WATCH | Kishanganj, Bihar | AIMIM Chief Asaduddin Owaisi says, "… Today an interviewer asked Tejashwi Yadav why he didn't align with Owaisi. Tejashwi said that Owaisi is an extremist, a fanatic, a terrorist… I ask Tejashwi, 'babu extremist ko tum zara angrezi mein likh ke… pic.twitter.com/vNiIgtm20h
— ANI (@ANI) November 2, 2025
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!