Ajit Pawar: ఎన్సీపీకి షాక్ ఇవ్వనున్న అజిత్ పవార్.. 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP’s Ajit Pawar joining hands with BJP..?:మహరాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతేడాది శివసేనను చీల్చి ఏకంగా ఏక్ నాథ్ షిండే బీజేపీ సహకారంలో సీఎం అయ్యారు. ఈ రాజకీయ వేడి చల్లారకముందు ఎన్సీపీ నేత అజిత్ పవార్, సీనియర్ లీడర్ శరద్ పవార్ కు షాకిచ్చేలా కనిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమచారం. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న రాజకీయ పరిణామాల్లో, అక్కడి ప్రజల్లో ఇదే చర్చ నడుస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బీజేపీ అగ్రనేతలు ఢిల్లీకి హుటాహుటిన వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
ఇటీవల కాలంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత అజిత్ పవార్ పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోదీని పొగిడారు. ఈ పరిణామాలు ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్) మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిని ఇరకాటంలో పడేశాయి. వరసగా రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చి దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లిందని అజిత్ పవార్ అనడం సంచలనంగా మారింది. ఇది మోదీ మ్యాజిక్ కాకుంటే ఇంకేంటంటూ..? ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే..
శరద్ పవార్ మేనల్లుడు అయిన అజిత్ పవార్ కు మద్దతుగా మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు పలుకున్నట్లు సమాచారం. 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీతో చేతులు కలిపేందుకు ఎన్సీపీలో చీలిక తెస్తారనే వార్తల మధ్య వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మంగళవారం మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చినట్లు వస్తున్న వార్తలు అబద్ధమని ఖండించారు.
ప్రస్తుత ఉన్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీకి చెందిన 53 మంది ఎమ్మెల్యేల్లో 34 మంది అజిత్ పవార్ కు మద్దతుగా బీజేపీతో చేతులు కలిపాలని, షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగం కవాలని అజిత్ పవార్ ఉద్దేశాన్ని సమర్థించారని తెలుస్తోంది. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్ మరియు ధనంజయ్ ముండేతో సహా పలువురు నేతలు అజిత్ పవార్ వెంటే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్, జితేంద్ర అవద్ మాత్రం బీజేపీతో చేతులు కలిపేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఈ విషయం పార్టీ చీఫ్ శరద్ పవార్ కు కూడా తెలిసిందని, ముందుగా వ్యతిరేకించినప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీతో పొత్తుకు సై అంటున్నారని తెలిసింది.
Read Also: R Ashwin Daughter : తండ్రి అవుటవ్వగానే బోరున ఏడ్చేసిన కూతురు
మహారాష్ట్ర క్లీన్ స్వీప్ లక్ష్యంగా బీజేపీ..
రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో లోక్ సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ భావిస్తోంది. అజిత్ పవార్ తోపాటు ఎన్సీపీ కలిసి వస్తే మహారాాష్ట్రలో మెజారిటీ సీట్లు ఎన్డీయే ఖాతాలో ఉంటాయి. దీంతో పాటు ఈడీ కేసులు ఎదుర్కొంటున్న అజిత్ పవార్ కుటుంబ, ప్రఫుల్ పటేల్, హసన్ ముష్రీఫ్ వంటి వారికి ఉపశమనం లభిస్తుంది. మహారాష్ట్రలో పాటు ఉత్తర్ ప్రదేశ్ తోడైతే 2024లో బీజేపీ అధికారాని ఢోకా ఉందనే భావనలో ఆ పార్టీ ఉంది. దీంతో పాటు ఎన్సీపీ నేతల నియోజకవర్గాలకు నిధులు వస్తాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపుకు తిరుగుండదని ఎన్సీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అయితే ఇదంతా శరద్ పవార్ ఆమోదం లేకుండా జరగదని, ఆయన మద్దతు లేకుండా అజిత్ పవార్ ప్రణాళిక విఫలం అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!