Operation Sindoor: పాకిస్తాన్ “కిరాణా హిల్స్‌”పై భారత్ దాడి చేసింది..

  • పాకిస్తాన్ ‘‘కిరాణా హిల్స్’’పై భారత్ దాడి చేసింది..
  • ఆపరేషన్ సిందూర్‌పై ప్రముఖ శాటిలైట్ ఫోటో నిపుణుడు..
  • పాకిస్తాన్ అణు స్థావరంగా కిరాణా హిల్స్..
Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా ఉగ్రవాద స్థావరాలను దెబ్బతీసిన భారత్, ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపులకు తీవ్రమైన సమధానం ఇచ్చింది. పాకిస్తాన్ వైమానికదళానికి చెందిన 11 ఎయిర్ బేస్‌లపై అటాక్ చేసింది. ఇందులో నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫికీ, సర్గోదా, జకోబాబాద్, స్కర్దు వంటికి ఉన్నాయి.

అయితే, ఆ సమయంలో పాకిస్తాన్ లోని సర్గోధ జిల్లాలోని ‘‘కిరాణా హిల్స్’’ పేరు ప్రముఖంగా వినిపించింది. పాకిస్తాన్ అణ్వాయుధాలను దాచే స్థలంగా పేరున్న ఈ కిరాణా హిల్స్ సమీపంలో భారత్ క్షిపణి దాడి చేసిందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే, మీడియా బ్రీఫింగ్‌లో మాత్రం భారత వైమానిక దళం (IAF) బహిరంగంగా ఈ వాదనల్ని ఖండించింది.

Read Also: Live-in Relationship: సహజీవనం చేస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే.. కానీ అది నిరూపించాలి..!

కానీ, కిరాణా హిల్స్ ప్రాంతంలో క్షిపణి దాడి జరిగిందని ప్రముఖ శాటిలైట్ ఫోటో నిపుణుడు డామియన్ సైమన్ స్పష్టం చేశారు. జూన్ 2025లో తీసిని గూగుల్ ఎర్త్ ఫోటోలను ఆయన విశ్లేషించి ఈ విషయాలను వెల్లడించారు. మే 2025లో ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ క్షిపణి దాడి తర్వాత, ప్రభావితమైన ప్రాంతానికి చెందిన చిత్రాలను ఆయన చూపించారు.

ఈ కిరాణా హిల్స్ సమీపంలోనే పాకిస్తాన్ కీలకమైన ఎయిర్ బేస్ సర్గోధ ఉంది. ఈ ఎయిర్ బేస్‌లో భారత దాడిలో తీవ్రంగా ధ్వంసమైంది. ఇప్పుడు పాకిస్తాన్ మరమ్మతులు చేసుకుంటున్న ఫోటోలను కూడా సైమన్ వెల్లడించారు.అయితే, భారత్ కు చెందిన ఆదంపూర్ ఎయిర్ బేస్‌లోని ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేసినట్లు పాకిస్తాన్ చేస్తున్న వాదనల్ని సైమన్ తోసిపుచ్చారు.