Bihar: అరే ఏంట్రా ఇది.. మైదానంలో రూ.3 కోట్లతో వంతెన..
- బీహార్‌లో ఇంతే కావచ్చు..
- మైదానంలో రోడ్డు లేకుండా బ్రిడ్జ్..
- వైరల్ అవుతున్న రూ. 3 కోట్ల వంతెన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: ఇటీవల కాలం భారీ వర్షాలు, వరదల కారణంగా వంతెనలు పేకమేడల్లా కూలిపోయాయి. పలు జిల్లా్ల్లో వంతెనలు కూలిపోయిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీహార్‌లోని జేడీయూ ప్రభుత్వంపై ఇటు ఆర్జేడీ తీవ్ర విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ బ్రిడ్జి నిర్మాణం వైరల్‌గా మారింది. పూర్తిగా మైదాన ప్రాంతంలో ఓ బ్రిడ్జ్ నిర్మించిన ఫోటో వైరల్ అయింది. ఈ బ్రిడ్జ్‌కి రోడ్డు లేకపోవడం, పొలాల్లో ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇరు వైపులా రోడ్డు లేకుండా రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించారు.
Read Also: IND vs SL: స్పిన్ దెబ్బకు చేతులెత్తిసిన టీమిండియా.. సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక ..
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ముఖ్యమంత్రి గ్రామీణ సడక్ పథకం కింద అరారియా జిల్లాలో ఈ వంతెన నిర్మాణం జరిగింది. పర్మానందర్‌పూర్ గ్రామంలో 3 కి.మీ పొడవైన రహదారి, వంతెన ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతంలో నది ఉందని, వర్షాకాలంలో సమస్యగా మారుతోందని, మిగిలిన ఏడాది ఇది ఎండిపోయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో గ్రామాలను కలుపేందుకు రోడ్డు, వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రస్తుతం బ్రిడ్జ్ నిర్మితమైన ప్రాంతాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే, మిగిలిన ప్రాంతాన్ని అధికారులు ఇంకా సేకరించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో సేకరించిన భూమిలో ప్రభుత్వం అప్రోచ్ మార్గం లేకుండానే వంతెన నిర్మించింది. దీనిపై అరారియా జిల్లా కలెక్టర్ ఇనాయత్ ఖాన్ స్పందించారు. ‘‘ ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి నివేదిక కోరాను. దీంతో పాటు సబ్ డివిజనల్ అధికారి, సర్కిల్ ఆఫీసర్, సంబంధిత ఇంజనీర్ సైట్‌ని సందర్శించాలని కోరాను. భూములు అందుబాటులో లేని సందర్భంతో ఈ ప్లాన్ ఎలా రూపొందించారనే విషయాన్ని పరిశీలిస్తున్నాము. అవసరమైన చర్యలు తీసుకుంటాము’’ అని కలెక్టర్ చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!