ఐఐటీ మ‌ద్రాస్ కీల‌క స‌ర్వే: ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్‌…

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  క్వారంటైన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్రం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  చాలా రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ఢిల్లీలో వీకెంట్ క‌ర్ఫ్యూను కూడా అమ‌లు చేస్తున్నారు.  రోజువారీ కేసులు గ‌త మూడు రోజులుగా ల‌క్ష‌కు పైగా న‌మోద‌వుతున్నాయి.  దీంతో అన్ని రాష్ట్రాల‌ను కేంద్రం అల‌ర్ట్ చేసింది.  ఇక‌పోతే, దేశంలో మూడో వేవ్ ఎప్ప‌టి వ‌ర‌కు పీక్స్ కు వెళ్తుంది అనే దానిపై ఐఐటీ మ‌ద్రాస్ కీల‌క స‌ర్వేను నిర్వ‌హించింది.  

Read: ‘పుష్ప’రాజ్ మాయలో పిల్లలు… అడ్డంగా దొరికేశారే!

ఈ స‌ర్వే ప్ర‌కారం దేశంలో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి ఫిబ్ర‌వ‌రి 15 మ‌ధ్య మూడో వేవ్ పీక్స్‌కు వెళ్తుంద‌ని పేర్కొన్న‌ది.  దేశంలో డిసెంబ‌ర్ 25 నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఆర్ వ్యాల్యూ 2.9గా ఉంటే, జ‌న‌వ‌రి 1 నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు ఆర్ వ్యాల్యూ 4 గా న‌మోదైన‌ట్టు ఐఐటీ మ‌ద్రాస్ పేర్కొన్న‌ది.  ఆర్ వ్యాల్యూ క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని,  క్వారంటైన్ నిబంధ‌న‌ల, ఆంక్ష‌ల‌ను క‌ఠినం చేస్తే వైర‌స్ స్ప్రెడ్ కావ‌డం త‌గ్గుతుందని, ఫ‌లితంగా ఆర్ వ్యాల్యూ త‌గ్గుతుంద‌ని ఐఐటి ప్రొఫెస‌ర్ జ‌యంత్ ఝా తెలిపారు.  సెకండ్ వేవ్ స‌మ‌యంలో క‌రోనా కేసులు పీక్స్‌కు వెళ్లిన స‌మయంలో ఆర్ వ్యాల్యూ 1.69 మాత్ర‌మే ఉన్న‌ది.  అయితే, మూడో వేవ్ ప్రారంభానికి మందే ఆర్ వ్యాల్యూ 2.9గా న‌మోదుకావ‌డానికి కార‌ణం ఒమిక్రాన్ వేరియంట్ అని, ఒమిక్రాన్ కార‌ణంగా కేసులు పెరుగుతున్నాయ‌ని, ఈ కొత్త వేరియంట్ డెల్టానే డామినెట్ చేస్తున్న‌ది అన‌డానికి పెరుగుతున్న కేసులు, ఆర్ వ్యాల్యూనే ఉదాహ‌ర‌ణ అని చెప్పుకొచ్చారు.  నిబంధ‌న‌లు పాటిస్తూ వ్యాక్సినేష‌న్ తీసుకుంటే ఈ మ‌హ‌మ్మారి ముప్పు నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని ప్రొఫెస‌ర్ ఝా పేర్కొన్నారు. 

Related Articles

Latest Articles