Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు టూరిస్టులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల్ని టార్గెట్ చేస్తూ మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈదాడికి లష్కరేతోయిబా అనుబంధం సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ బాధ్యత ప్రకటించుకుంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించాయి. మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, సైనికాధికారులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తు్న్నారు.
Read Also: Pahalgam terror attack: పీఓకేలో 42 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్.. కాశ్మీర్‌లో 56 మంది ఉగ్రవాదులు..
ఇదిలా ఉంటే, పహల్గామ్ దాడితో యావత్ దేశం బాధపడుతున్న సమయంలో, అదే రోజు పాకిస్తాన్ ప్రధాని షెహజాబ్ షరీఫ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ‘‘కాశ్మీర్’’ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచం మొత్తం పహల్గామ్ ఉగ్రదాడిపై సంతాపం తెలియజేస్తుంటే, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, టర్కీష్ అధ్యక్షుడికి థాంక్స్ తెలిపాడు. అంకారాలో జరిగిన సమావేశంలో కాశ్మీర్‌పై టర్కీ”అచంచలమైన మద్దతు”కు కృతజ్ఞతలు తెలిపారు.
కాశ్మీర్ విషయంలో పలు సందర్భాల్లో టర్కీ పాకిస్తాన్‌కి మద్దతుగా నిలుస్తోంది. టర్కీ అంతర్జాతీయ వేదికలపై కూడా కాశ్మీర్ సమస్యని లేవననెత్తింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కాశ్మీర్‌పై పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తున్నాడు. అయితే, పలు సందర్భాల్లో భారత్ టర్కీ జోక్యాన్ని తీవ్రంగా ఖండించింది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది.
