Congress: ఇందిరాగాంధీ హత్యను సెలబ్రేట్ చేసుకున్న ఖలిస్తానీవాదులు.. చర్యలకు కాంగ్రెస్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కెనడా ఖలిస్తానీ వేర్పాటువాదులకు కేంద్రంగా మారుతోంది. భారత వ్యతిరేఖతను అక్కడ కొంతమంది సిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్ లో జరిగిన ఓ పరేడ్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని, ఇద్దరు సిక్కు బాడీగార్డులు చంపుతున్నట్లు చూపించే శకటాన్ని ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని భారతవిదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ని కోరింది. దీనిపై విలేకరులు అడిన ప్రశ్నకు జైశంకర్ కెనడా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించే వ్యక్తులకు చోటివ్వడం సమస్యగా ఉందని అన్నారు.
Read Also: Alluarjun :ఆ కారణం వల్ల భారీ హిట్ ను వదులుకున్న అల్లు అర్జున్..?
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
అంతకుముందు భారతదేశంలో కెనడా హైకమీషనర్ కామెరూన్ మాకే మాట్లాడుతూ.. భారత ప్రధాని హత్యను సెలబ్రేట్ చేసిన ఘటన గురించి తెలిసి షాక్ అయ్యానని అన్నారు. కెనడాలో ద్వేషానికి, హింసను కీర్తించడానికి చోటు లేదని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ మిలింద్ దేవరా దీనిపై స్పందిస్తూ.. ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన శకటాన్ని 5 కిలోమీటర్లు పెరెడ్ నిర్వహించడాన్ని చూసి భారతీయుడిగా నేను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. ఇది హేయమైన చర్య అని, దీనిపై జైశంకర్, కెనడా అధికారులపై గట్టిగా వ్యవహరించాలని మరో కాంగ్రెస్ నేత జైరాంరమేష్ ట్వీట్ చేశారు. పార్టీలకి అతీతంగా దీనిపై చర్యలు తీసుకోవాలని శశిథరూర్ డిమాండ్ చేశారు.
అంతకుముందు ఈ ఘటనపై జైశంకర్ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే, ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుంటే ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు, దీన్ని మేం అర్థం చేసుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. పరోక్షంగా కెనడా తీవ్రవాదులు, వేర్పాటువాదులకు చోటిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది ఇరు దేశాల సంబంధాలకు మంచిది కాదని కెనడాకు సూచించారు. 1984లో స్వర్ణదేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నిర్వహించిన కొన్ని నెలల తర్వాత ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డులే కాచ్చి చంపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..