కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతున్న వేళ కేంద్రం దృష్టి సారించింది. కొవిడ్ నివారణ చర్యలను చేపట్టాలని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
Omicron Subvariant BF.7 Symptoms: చైనాలో అల్లకల్లోలానికి దారి తీస్తోంది ఓమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్. ఆ దేశంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. జీరో కోవిడ్ విధానాన్ని కూడా చైనా ప్రభుత్వం ఎత్తేయడంతో రానున్న మూడు నెలల్లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని.. జనాభాలో 60 శాతం మంది కోవిడ్ బారిన పడతారని పరిశోధకులు చెబుతున్నారు.
Omicron subvariant BF.7 detected in India : చైనాలో కోవిడ్ -19 విజృంభనకు కారణం అవుతున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. తాజాగా భారత్ లో మూడు బీఫ్.7 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక బీఎఫ్.7 వేరియంట్ కేసులను బుధవారం వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో మొదటి బీఎఫ్.7 కేసును అక్టోబర్ లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. చైనాలో తీవ్రమైన కోవిడ్ కేసులకు ఈ…