Odisha Student: లైంగిక వేధింపుల కారణంగా, నిప్పంటించుకున్న ఒడిశా విద్యార్థిని మృతి..
- తనకు తాను నిప్పంటించుకున్న ఒడిశా విద్యార్థిని మృతి..
- ప్రొఫెసర్ లైంగిక వేధింపుల కారణంగా యువతి ఆత్మహత్య..
- దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Student: తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించింది. తీవ్రమైన కాలిన గాయాలతో జూలై 12న క్యాజువల్టీకి తీసుకువచ్చారు, అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.
కాలేజ్ ప్రొఫెసర్ నుంచి సుదీర్ఘ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థిని, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఎయిమ్ ప్రకటన ప్రకారం, ఆమెకు వెంటిలేషన్, ఐవీ, యాంటీబయాటిక్స్, కిడ్నీ చికిత్స అందించినా, జూలై 14న ఆమె తన గాయాల కారనంగా మరణించిందని ఆస్పత్రి ధ్రువీకరించింది.
Also Read
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
Read Also: Baba Vanga : బాబా వంగా మరో సంచలనం.. 2025 రెండోార్థంలో ఈ మూడు రాశులవారికి అదృష్టమే అదృష్టం..!
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మాఝి తన విచారాన్ని వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, వైద్య బృందం అన్ని రకాల మద్దతు అందించినప్పటికీ, బాధితురాలిని ప్రాణాలతో కాపాడలేకపోయామని అన్నారు. ఈ కేసులో దోషులందరికి శిక్ష పడుతుందని, దీనిపై తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు జారీ చేశానని చెప్పారు. ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తుందని వెల్లడించారు.
తనపై హెచ్ఓడీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపాల్ మరియు కళాశాల అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో ఆ విద్యార్థిని తనను తాను నిప్పంటించుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ కేసులో కాలేజ్ ఫ్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ ను అరెస్ట్ చేశారు. 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీని తరలించారు.
తాజావార్తలు
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!