Odisha Student: తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించింది. తీవ్రమైన కాలిన గాయాలతో జూలై 12న క్యాజువల్టీకి తీసుకువచ్చారు, అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్ నుంచి సుదీర్ఘ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థిని, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య…