ఛత్ పండుగ. దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించే ఫెస్టివల్. అక్టోబర్ 25న ప్రారంభమైన ఈ పండుగ మంగళవారంతో ముగుస్తుంది. ఈరోజు ఛత్ పూజ నిర్వహించనున్నారు. ఉదయం నుంచే సూర్య నమస్కారాలు చేస్తూ.. నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉత్సాహంగా సాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఛత్ పూజలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్ పూజలో పాల్గొనడం అదృష్టం అన్నారు. ఇక ఛత్ పండుగను పురస్కరించుకుని ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన.. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి
ఇదిలా ఉంటే ఛత్ పూజను పురస్కరించుకుని ఈరోజు ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. వివిద నగరాల్లో మంగళవారం బ్యాంకులు పని చేయవు. బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో బ్యాంకులు మూసేసి ఉంటాయి. ఈ మూడు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా ఛత్ పండుగ నిర్వహిస్తుంటారు. అలాగే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఈ పండుగను జరుపుకోవడంతో అక్కడ కూడా బ్యాంకులు మూసేసి ఉంటాయి.
ఇది కూడా చదవండి: Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ఏపీ, యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ
బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఛత్ పండుగను నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో రెండు రోజులు బ్యాంకులకు సెలవులు ప్రకటించాయని ఆర్బీఐ తెలిపింది. రెండో శనివారం, ఆదివారం కూడా యథావిధిగా మూసివేయబడతాయని పేర్కొంది. సెలవులు కారణంగా ఏర్పాట్లు చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది.
అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గాంగ్టక్, గౌహతి, హైదరాబాద్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పనాజి, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలో కూడా పలు చోట్ల బ్యాంక్‌లు మూసివేసి ఉంటాయి.
ఛత్ ప్రత్యేకత ఇదే..?
ఛత్ అనేది ఒక పురాతన ఇండో-నేపాల్ హిందూ పండుగ. తూర్పు భారతదేశం-దక్షిణ నేపాల్‌కు చెందిన పండుగ. ముఖ్యంగా భారతదేశంలోని బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పండుగ జరుపుకుంటారు. అలాగే నేపాల్‌లోని కోషి, గండకి, బాగ్మతి, లుంబిని, మాధేష్ ప్రావిన్సుల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఆనందంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.
ఛత్ పండుగను దీపావళి తర్వాత 6 రోజులకు జరుపుకుంటారు. ఈ పండుగను ‘‘సూర్య షష్టి వ్రతం’’గా పిలుస్తారు. మూడు రాత్రులు-నాలుగు పగళ్లు ఆచరాలు పాటిస్తారు. ఎంతో భక్తితో ఉపవాసం ఉండి.. పవిత్ర సాన్నం చేసి సూర్య నమస్కారాలు చేస్తారు. వ్యక్తిగత కోరికలు నెరవేర్చాలని కోరుతూ సూర్యుడికి ప్రార్థనలు చేస్తారు. అందుకే ఈ పండుగను ‘‘సూర్య షష్టి వ్రతం’’గా పిలుస్తారు. ఇక భక్తులంతా ఒకేలాటి ప్రసాదాలు, నైవేద్యాలు సిద్ధం చేసుకుంటారు.
నైవేద్యాలు ఇవే:
తేకువా: ఛత్ పూజ సమయంలో ప్రసిద్ధమైన నైవేద్యం ‘తేకువా’. దీనిని గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో కరకరలాడేలా తయారు చేస్తారు. ఇదొక తీపి చిరుతిండి.
రెండోది రసబలి: చదును చేసిన బియ్యంను తియ్యటి పాలలో నానబెట్టి, యాలకులు, ఎండిన పండ్లతో రుచిగా తయారు చేసే డెజెర్ట్.
మూడోవది కాసర్ (లడ్డూ): బియ్యం పొడి లేదా గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసే లడ్డూ. చిన్న సైజులో తయారు చేసి పవిత్ర నైవేద్యంగా భావిస్తారు.
నాల్గోవది బియ్యం లడ్డూ (పీఠ): బెల్లం, కొబ్బరిని ఆవిరితో ఉడికిస్తారు.
ఈ వంటకాలు నైవేద్యాలు మాత్రమే కాదు. ఛత్ పండుగలో స్వచ్ఛత, భక్తి, సాంస్కృతి గొప్పతనాన్ని సూచిస్తాయి. ఛత్ పండుగ అనేది అత్యంత పర్యావరణ అనుకూల మత పరమైన పండుగుల్లో ఒకటిగా పర్యావవరణవేత్తలు అభివర్ణిస్తారు.
విశిష్టత ఇదే..
ఛత్ పూజను సూర్య దేవుడికి అంకితం చేస్తారు. ఛత్ మాతను కూడా పూజిస్తారు. పిల్లలకు అనారోగ్యాలు, వ్యాధుల నుంచి రక్షణ, దీర్ఘయుష్షుతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందని ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అక్టోబర్ 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు చాలా భక్తితో నిర్వహిస్తారు. ఈ పండుగను మహిళలే కాకుండా.. పురుషులు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో చేపడతారు. ఉదయం సూర్య భగవానుని పూజించిన తర్వాత రాత్రిపూట ఛత్ పాటలు పాడతారు. అంతేకాకుండా వ్రత కథను చదువుతారు. ప్రతి రోజు ఉదయం 5-7 చెరుకు కర్రలను కలిపి ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తారు. దాని కింద 12-24 దీపాలు వెలిగించి తేకువాతో పాటు సీజనల్లో వచ్చే పండ్లను సమర్పిస్తారు. మరుసటి రోజు ఉదయం 3-4 గంటల మధ్యే ఈ ఆచారాన్ని పూర్తి చేసేస్తారు. అనంతరం సూర్యుడు ఉదయించగానే సూర్య నమస్కారాలు చేసి వ్యక్తిగత కోరికలను తీర్చాలని ప్రార్థిస్తారు. అనంతరం నైవేద్యాలను అంకితం చేస్తారు. ప్రతి రోజున నది ఒడ్డునే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
#WATCH | Telangana: A large number of devotees gathered at Tank Bund in Hyderabad to perform #ChhathPuja this morning. pic.twitter.com/l3YZeDfvte
— ANI (@ANI) October 28, 2025
PM Narendra Modi tweets, "Today, the auspicious conclusion of the great festival of Chhath took place with the morning arghya offered to Suryadev. During this four-day ritual, we witnessed the divine darshan of our grand tradition of Chhath Puja. Heartfelt congratulations to all… pic.twitter.com/YmFHTakwvF
— ANI (@ANI) October 28, 2025
#WATCH | #ChhatPuja | Delhi Chief Minister Rekha Gupta says, "I am fortunate that I was able to participate in the worship of Chhati Maiya and we all together enjoyed this great festival of Chhath." https://t.co/DTWGSerw4A pic.twitter.com/eEb2r9LXDC
— ANI (@ANI) October 28, 2025
#WATCH | Delhi Chief Minister Rekha Gupta performs #ChhathPuja rituals at Hathi Ghat near ITO. pic.twitter.com/YCBa3nC72V
— ANI (@ANI) October 28, 2025