INDIA MPs: మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయండి.. రాష్ట్రపతికి ఇండియా ఎంపీల విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA MPs: మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ప్రతిపక్ష కూటమి ఇండియా ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్ అంశంపై రాష్ట్రపతికి వివరించడానికి సమయం కోరగా ఈ రోజు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని ఇండియా కూటమి ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా గత మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ఇండియా కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సూచించారు. ఈ చర్య రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను సరిదిద్దేందుకు సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.మణిపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రాష్ట్రపతిని ఎంపీలు కోరారు.
Read also; KA Paul: నాలుగేళ్ళ నుంచి రమ్మంటున్నా… నేనొద్దు మోడీనే ముద్దంటున్నాడు!
Also Read
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
రాష్ట్రపతిని ఇండియా కూటమి ఎంపీలు కలిసిన సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) సభ్యురాలు సుస్మితా దేవ్ మణిపూర్ మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని అభ్యర్థించారు. అలాగే మణిపూర్ ఘటనలపై పార్లమెంట్లో ప్రకటన చేయాలని ప్రధాని మోడీని అడగాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని కోరారు. ‘‘మణిపూర్‌లో వేర్వేరు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతికి సూచించాం. ఈ చర్య రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సరిదిద్దేందుకు ఉపయోగకరంగా ఉంటుందని సుస్మితా దేవ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీయూ నాయకుడు రాజీవ్ రంజన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, శివసేన (యూబీటీ) నాయకులు అర్వింద్ సావంత్, సంజయ్ రౌత్, టీఎంసీ నాయకులు సుదీప్ బంధోపాధ్యాయ, డెరెక్ ఒబ్రెయిన్‌లు ఉన్నారు.
తాజావార్తలు
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!