దేశంలో కరోనా కేసులు దాదాపుగా కంట్రోల్లోకి వచ్చింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేశారు. ప్రస్తుతం ఆంక్షలు పూర్తిస్థాయిలో ఎత్తివేస్తున్నారు. ఇప్పటి వరకు కార్లలో ప్రయాణం చేసే సమయంలోకూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే రూల్ ఉండేది. ఇప్పుడు ఆ రూల్ను పక్కన పెట్టేశారు. కార్లలో ప్రయాణం చేసే సమయంలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. అయితే, పబ్లిక్ ప్లేస్లో మాస్క్ ధరించకుంటే విధించే జరిమానాను రూ. 2000 నుంచి 500 కు తగ్గిస్తూ ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీలో కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
Read: Russia Z Symbol: రష్య యుద్ధ ట్యాంకులపై జెడ్ గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా?