బాధలు సోషల్ మీడియాలో పంచుకుంటే కేసులు పెడతారా?-సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో పోస్టులు.. వాటిపై పోలీసులు కేసులు పెట్టడంపై సీరియస్‌గా స్పందించింది సుప్రీంకోర్టు.. కరోనా వల్ల తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే.. పోలీసులు కేసులు పెడతారా? అని నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం.. ఇకపై సహించబోమని స్పష్టం చేసింది.. ఇకపై ఎవరైనా వేధిస్తే కోర్టు ఆదేశాల ధిక్కారంగా భావిస్తామని వ్యాఖ్యానించింది జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. ఒక వ్యక్తిగా, జడ్జిగా ఈ విషయం నాకు ఆందోళన కల్గిస్తోంది.. ఒక వ్యక్తి తన బాధను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తే… దానిని నిషేధించే ప్రయత్నం చేస్తారా…? ప్రజల ఆవేదనను వినండి అంటూ చురకలు అంటించారు.
ఎవరైనా వ్యక్తి తనకు ఆక్సిజన్ కావాలని, బెడ్ కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే… వారిని వేధించడం సరికాదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. మనం ఇప్పుడు మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు జస్టిస్ చంద్రచూడ్. కాగా, కరోనాతో ఇబ్బంది పడుతోన్న ఓ బాధితుడు.. ఇటీవల తనకు ఆక్సిజన్ కావాలని ట్వీట్ చేశాడు.. అయితే, దానిని ఓ ప్రముఖ జర్నలిస్ట్ రీ ట్వీట్ చేస్తే… ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిపై కేసు పెట్టింది.. అంతే కాదు.. ఎవరైనా బెడ్ లేదని, ఆక్సిజన్ లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసు పెడతామని యూపీ సర్కార్ వార్నింగ్ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!