మనదేశంలో ప్రజలకు దేవుళ్ళు అన్నా, దేవుళ్ళకు సంబందించిన ఏదైనా కూడా ఇట్లే నమ్మేస్తుంటారు.. అందుకే వీధికో గుడి దర్శనమిస్తుంది..ఈ నమ్మకాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.. అది అడ్డు పెట్టుకొని కొందరు దొంగ బాబాలు విచ్చల విడిగా డబ్బులను సంపాదిస్తున్నారు.. మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు, దారుణాలకు ఒడిగట్టారు.. అలాంటి వారి లిస్ట్ నిత్యానంద స్వామీ పేరు మొదటగా వినిపిస్తుంది.. ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురుకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం…
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి… మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే, తప్పుడు వదంతులపై నిత్యానంద క్లారిటీ ఇచ్చారు. తాను సమాధిలోకి వెళ్లానని… తన అనుచరులు, భక్తులు, శిష్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నట్లు వివరించిన నిత్యానంద… వైద్యుల బృందం చికిత్స చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నానని……