Asaduddin Owaisi: “నేను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నా నమ్మలేదు”.. బీహార్ రాజకీయాలపై ఓవైసీ ఫైర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: జేడీయూ అధినేత నితీష్ కుమార్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. మరోవైపు ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే నితీష్ కుమార్ సీఎం అవుతారని, ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్రమోడీ ఇష్టం మేరకే పాలన సాగుతుందని ఆయన అన్నారు. మళ్లీ బీజేపీతో జేడీయూ జతకట్టడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pinarayi Vijayan: కేరళలో ముదురుతున్న గవర్నర్-సీఎం మధ్య వార్..
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ప్రధాని నరేంద్రమోడీ, సీఎం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌లు బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నితీష్ ప్రజలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ-బీ టీమ్ అంటూ తమను ఎగతాళి చేసిన నితీష్ కుమార్, ఇప్పుడు ఆయన చేసిందేంటని ప్రశ్నించారు. రాజకీయ అవకాశవాదం అనే పదానికి నితీష్ కుమార్ అర్థమని, ఇందులో ఆయన రికార్డులు బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. అతను బీజేపీతో కలుస్తారని ఎప్పటి నుంచో చెబుతున్నానని అయితే, ఎవరూ నమ్మలేదని అన్నారు.
తేజస్వీ యాదవ్ నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పుడు అతను అదే బాధను అనుభవిస్తున్నాడు అని అన్నారు. యాదవ్, అతని కుటుంబం బీహార్ ప్రజలను పక్కన పెట్టారని దుయ్యబట్టారు. నితీష్ కుమార్ మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రధాని మోడీ అతనిని విమర్శించాడు, దేశ మహిళల్ని రక్షిస్తానని అన్నాడని, ఇప్పుడు నితీష్ కుమార్‌తో కలిసి ప్రధాని టీ తాగుతున్నాడని అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!