Site icon NTV Telugu

Nitish Kumar: నేడు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం.. కొలువుదీరనున్న ఎన్డీయే సర్కార్..

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: దేశంలో నితీష్ కుమార్ రికార్డ్ సృష్టించబోతున్నారు. 10వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా ఎన్డీయే నేతలు హాజరుకాబోతున్నారు. బుధవారం ఎన్డీయే ఎమ్మెల్యేలు నితీష్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఆయన పేరును సిఫారసు చేయడంతో, ఎన్డీయే ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్‌ను ఎన్నుకున్నారు. దీని తర్వాత నితీష్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌‌కు రాజీనామా సమర్పించి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఈ రోజు సీఎంగా నితీష్ కుమార్‌తో పాటు 18 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Also: Alert In Sabarimala: అయ్యప్ప భక్తులకు హైఅలర్ట్.. శబరిమలలో భక్తుల రద్దీతో కేరళ సర్కార్ కీలక ఆదేశాలు..

ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. 234 సీట్లకు గానూ బీజేపీ – జేడీయూల కూటమి ఏకంగా 202 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది, తరువాత జేడీయూ 85 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జెపి (ఆర్వి) 19 సీట్లతో, హెచ్ఎఎమ్ ఐదు సీట్లతో, ఆర్ఎల్ఎం నాలుగు సీట్లతో సత్తా చాటాయి. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్‌ల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి 35 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆర్జేడీ 25 సీట్లతో ఘోర పరాజయం పాలైంది.

Exit mobile version