Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
- 2016కు ముందు తయారైన కొన్ని వాహనాలకు మాత్రమే స్వల్ప మార్పులు అవసరం.
- ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు అవసరం లేదని అధ్యయనాలు వెల్లడి.
- రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు మాత్రమే మార్చాల్సి రావొచ్చు.
- E20 పెట్రోల్‌పై సమాధానం ఇచ్చిన నితిన్ గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2005 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత్ స్టేజ్-III (BS-III) ప్రమాణాల కింద తయారైన, 2016కు ముందు ఉత్పత్తి చేసిన కొన్ని వాహనాల్లో రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావొచ్చని చెప్పారు.
అయితే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, E20 పెట్రోల్ వినియోగానికి కార్లు, టూవీలర్ల ఇంజన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని స్పష్టం చేశారు. పాత వాహనాలపై కూడా చేసిన అధ్యయనాల్లో పనితీరులో గణనీయమైన మార్పు, సమస్యలు లేవని గడ్కరీ వెల్లడించారు. డైవబిలిటీ, స్టార్టబిలిటీ, లోహాలు, ప్లాస్టిక్ భాగాల అనుకూలత వంటి అంశాల్లో కూడా ఎలాంటి సమస్యలు గుర్తించలేదని చెప్పారు.
Also Read
- Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
- Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
- Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
- LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
2016కు ముందు తయారైన కొన్ని BS-III వాహనాల్లో మాత్రమే రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు మార్చాల్సి రావచ్చని, వీటిని సాధారణ సర్వీసింగ్ సమయంలోనే సులభంగా మార్చొచ్చని తెలిపారు. E20 పెట్రోల్ వల్ల మాత్రమే మైలేజ్ తగ్గుతుందని చెప్పలేమని, వాహన పనితీరు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, ఆటోమొబైల్ తయారీ సంస్థలు, పరీక్షలు చేసిన సంస్థలు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. E20 పెట్రోల్‌పై శాస్త్రీయ అధ్యయనాలు, దశలవారీగా అమలు, అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే అమలు చేస్తున్నామని గడ్కరి చెప్పారు. బ్రెజిల్ వంటి దేశాల్లో దశాబ్ధాలుగా అధిక ఇథనాల్ బ్లెండెట్ ఇంధనాన్ని విజయవంతంగా వినియోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
-
Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!