Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
- Honor X9e Pro 5G వచ్చేసింది
- 120Hz AMOLED డిస్ప్లే, Snapdragon 6 Gen 5
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor X9e Pro 5G Launched Globally: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor మరో పవర్ఫుల్ 5G ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. Honor X9e Pro 5G పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ భారీ 11,000mAh బ్యాటరీ, 108MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ఫోన్ డిస్ప్లే 10,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మలేషియా మార్కెట్లో ఈ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇటీవలే 8,100mAh బ్యాటరీతో Honor 600 Elite 5Gని తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు మరింత పెద్ద బ్యాటరీతో X9e Pro 5Gని మార్కెట్లోకి తీసుకువచ్చింది.
Honor X9e Pro 5G ధర
Honor X9e Pro 5G రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
8GB RAM + 256GB స్టోరేజ్: MYR 1,899 (సుమారు రూ.44,668)
8GB RAM + 512GB స్టోరేజ్: MYR 2,399 (సుమారు రూ.56,428)
Also Read
- Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
- 100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
- ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
- ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
ఈ స్మార్ట్‌ఫోన్ Royal Purple, Midnight Black, Dawn Gold, Reddish Brown అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మలేషియాలో అక్టోబర్ 8 నుంచి ప్రీ-ఆర్డర్లను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. Honor X9e Pro 5Gలో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 10,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేకు రక్షణగా Corning Gorilla Glass Victus 2ను అందించారు. అధిక బ్రైట్నెస్ కారణంగా ఎండలో కూడా స్క్రీన్‌పై కంటెంట్‌ను స్పష్టంగా చూడటానికి ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.
Snapdragon 6 Gen 5 ప్రాసెసర్
పనితీరు కోసం ఈ ఫోన్లో Qualcomm Snapdragon 6 Gen 5 చిప్‌సెట్‌ను అందించారు. ఇందులో 8GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ర్యామ్‌ను వర్చువల్‌గా 24GB వరకు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం Honor X9e Pro 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించింది. 108MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
11,000mAh భారీ బ్యాటరీ
ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణగా 11,000mAh బ్యాటరీ నిలుస్తోంది. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందించారు. భారీ బ్యాటరీ కారణంగా ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. Honor X9e Pro 5Gకి IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయని కంపెనీ పేర్కొంది. దీంతో దుమ్ము, నీటి ప్రభావం నుంచి ఫోన్‌కు రక్షణ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం 5G, Wi-Fi 6E, Bluetooth, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. 11,000mAh బ్యాటరీ, 10,000 నిట్స్ AMOLED డిస్ప్లే, 108MP కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో Honor X9e Pro 5G మలేషియా మార్కెట్లోకి వచ్చింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!