3 Girls Get Electric Shock While Talking On Phone In Chennai: తమిళనాడులోని చెన్నై నగరంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పవర్ బ్యాంక్‌కి చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా.. ఓ యువతికి కరెంట్ షాక్ కొట్టింది. ఆమెను కాపాడబోయిన మరో ఇద్దరికీ షాక్ తగిలింది. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని ఓ హాస్టల్‌లో ఉంటోన్న యువతి, తన పవర్ బ్యాంక్‌కి చార్జింగ్ పెట్టి ఫోన్‌లో మాట్లాడుతోంది. అయితే.. ఆ హాస్టల్ కిటికీ సమీపంలోనే విద్యుత్ పోల్ ఉంది. ఆ యువతి కూడా కిటికీ దగ్గరే నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. ఇంతలో విద్యుత్ పోల్ నుంచి ఆ పవర్ బ్యాంక్‌కి కరెంట్ సప్లై అయ్యింది. ఆ పవర్ బ్యాంక్‌కి ఫోన్ ఎటాచ్ చేసి ఉండటంతో.. కరెంట్ షాక్ కొట్టి ఆ యువతి అల్లాడిపోయింది. అదే రూమ్‌లో ఉన్న మరో ఇద్దరు యువతులు అది గమనించి.. ఆమెను కాపాడబోయారు. కానీ.. వారికి కూడా షాక్ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్న వైద్యులు.. వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
Fasting Benefits: ఉపవాసంతో అద్భుత ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?
ఇలా చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా.. ఫోన్ పేలి ఎందరో గాయపడిన సంఘటనలు ఇదివరకు చాలానే చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు ఓవర్‌హీట్ కారణంగా సెల్‌ఫోన్లు పేలిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల వల్ల చాలామంది తీవ్ర గాయాలపాలైతే.. మరికొందరు ప్రాణాలే కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చార్జింట్ పెట్టి ఫోన్‌లో మాట్లాడొద్దని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే కొందరు వారి మాటల్ని బేఖాతరు చేస్తున్నారు. అయితే.. ఇక్కడ పవర్ పోల్ దగ్గరగా ఉండటం వల్ల పవర్ బ్యాంక్‌కి కరెంట్ సప్లై అయి, దానికి ఎటాచ్ చేసిన ఫోన్ ద్వారా షాక్ కొట్టింది. అవగాహన లోపంతో ఆ యువతి చేసిన చిన్న తప్పు.. ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. కుటుంబసభ్యులు తమ పిల్లలు ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
Road Accident: పల్టీలు కొట్టిన వాహనం.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం