దర్భంగా బ్లాస్ట్ కేసులో ఎన్‌ఐఏ విచారణ కొనసాగుతోంది… ఈ విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి… దర్భంగా పేలుడు ప్లాన్ లో నిందితులకు హవాలా రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు అందినట్టు తెలుస్తోంది.. హైదరాబాద్ మల్లేపల్లిలో ఉన్న మాలిక్ సోదరులకు హవాలాతో హాజీ సలీం డబ్బు చేరవేసినట్టుగా తేల్చింది ఎన్‌ఐఏ… బట్టల వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూసిన నాసిర్ మాలిక్‌కు యూపీ ఖైరానాకు చెందిన ఇక్బాల్ ఖానాను సంప్రదించాలని పలువురు సలహా ఇవ్వగా.. పదేళ్ల క్రితం పాకిస్థాన్ వెళ్లి ఇక్బాల్ ఖానాని నాసిర్ మాలిక్ కలిసినట్టుగా ఎన్‌ఐఏ తేల్చింది. అప్పుడే కెమికల్ బాంబుల తయారీ విధానం నాసిర్ మాలిక్ నేర్చుకున్నట్టు ఎన్‌ఐఏ చెబుతోంది.. సొంత జిల్లా కైరానాలో హాజీ సలీంతో కలిసి రైలు, బస్సు బ్లాస్ట్ లకు ప్లాన్ చేశాడు.. దీనికోసం నాసిర్ మాలిక్ కు హవాలా రూపంలో డబ్బు సరఫరా చేశారు.. ఆ డబ్బుతోనే కెమికల్ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు నాసిర్ మాలిక్.. వీరికి పాకిస్థాన్‌లో ఉండి బ్లాస్ట్ లకు ప్లాన్ వేస్తున్న లష్కరేతొయిబా ఉగ్రవాది ఇక్బాల్ ఖానా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నట్టుగా తేల్చారు.. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారినే బ్లాస్టింగ్స్ కు ఎంపిక చేసుకోవడం.. వారి లక్ష్యణాలను నెరవేర్చుకోవడం పనిగా పెట్టుకున్నారు.