FASTag Alert: ముందువైపు అద్దం మీదే ఫాస్టాగ్.. లేకపోతే టోల్ రుసుం డబుల్..!
- ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం..
- ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై ఏర్పాటు చేయాలని ఆదేశాలు..
- విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ లేకపోతే డబుల్ టోల్ రుసుం వసూలు చేయాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FASTag Alert: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై ఏర్పాటు చేయకపోవడంతో టోల్‌గేట్ల దగ్గర చెల్లింపుల విషయంలో అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇకపై విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్ స్టికర్ ఏర్పాటు చేయకపోతే.. టోల్‌లైన్‌లోకి ప్రవేశించే వాహనదారుల నుంచి డబుల్ టోల్ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విండ్‌స్క్రీన్‌పై ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేయకపోవడంతో టోల్ ప్లాజాల దగ్గర అనవసరమైన జాప్యాలు కొనసాగుతున్నాయని.. దాంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.
Read Also: Pakistan : భయపడిన పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం..ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
కాగా, ముందువైపు అద్దంపై ఫాస్టాగ్ స్టికర్ లేకపోతే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ పొడ్యూసర్‌ని జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్‌లను అమర్చని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ లేకుండా టోల్‌లేన్‌లోకి ప్రవేశిస్తే విధించే రుసుంలపై డబుల్ ఫీజులతో కూడిన బోర్డులు ప్రదర్శించాలని ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు ఇచ్చింది. ఫాస్టాగ్‌లు లేని వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీలో సైతం రికార్డు చేయాలని వెల్లడించింది. దీంతో వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.
అయితే, ఫాస్టాగ్‌లను ఏర్పాటు చేసుకోలేకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అలా చేసే వారిని బ్లాక్‌లిస్ట్ చేర్చ వచ్చని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. వివిధ పాయింట్ల నుంచి జారీ చేసే సమయంలో వాహనం విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్ ఇన్‌స్టాల్ చేసినట్లుగా నిర్ధారించుకోవాలని ఆయా బ్యాంకులను సైతం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న వెయ్యి టోల్ ప్లాజాల దగ్గర సుమారు 45 వేల కిలో మీటర్ల జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో వాహనదారుల నుంచి టోల్ రూసుం వసూలు చేస్తున్నారు. దాదాపు 8 కోట్ల మంది నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్ దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
తాజావార్తలు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!