Tamil Nadu: కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం.. తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె
- కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం
- తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి. అటు తల్లిదండ్రులను బాధపెట్టలేక.. ఇటు మనసు చంపుకోలేక తనకు తానుగా మరణశాసానాన్ని రాసుకుంది. చనిపోయే ముందు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రికి చివరి సందేశాన్ని వాట్సాప్ ద్వారా రికార్డ్ చేసి పంపించింది. తాజాగా ఈ రికార్డ్ వాయిస్‌లు కంటతడి పెట్టిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Odisha: ఒడిశాలో దారుణం.. ఆఫీస్‌లోనే అధికారిని కొట్టిన బీజేపీ నేతలు
Also Read
- Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
- Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో గత ఏప్రిల్‌లో కవిన్ కుమార్ అనే యువకుడితో రిధన్య (27) వివాహం జరిగింది. పెళ్లి సమయంలో దాదాపు రూ.కోటి వరకు కట్న, కానుకలు ఇచ్చారు. ఇంకేముంది కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ వారం తర్వాత అత్తారింటి స్వరూపం బయటపడింది. నిత్యం భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. అంతేనా అంటే అంతకు మంచి టార్చర్ చేయడం ప్రారంభించారు. భర్త కవిన్‌కుమార్ శారీరికంగా హింసిస్తుంటే.. మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవి మానసికంగా హింసించడం మొదలు పెట్టారు. దీంతో రిధన్య కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా ఎంత కాలం బ్రతకాలంటూ తనకు తాను మరణశాసానాన్ని రాసుకుంది. తిరిగి పుట్టింటికి వెళ్లి రక్తసంబంధుకుల్ని బాధపెట్టకూడదని.. వాళ్లను మరింత వేదనకు గురి చేయకూడదని చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకుంది. అయితే చివరిగా తన తండ్రికి వాట్సాప్ ద్వారా తన గోడును వెళ్లబుచ్చుకుంది. అత్తారింట్లో అనుభవిస్తున్న నరకాన్ని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Meenakshi Chaudhary : కూల్ వెదర్ లో మీనాక్షి చౌదరి హాట్ ఫొటోస్
‘‘నా భర్త, అతని కుటుంబ సభ్యులే నా మరణానికి కారణం. నేను రోజు శారీరకంగా.. మానసికంగా వేధింపులకు గురవుతున్నా. ఇక ఈ జీవితం నాకు వద్దు. వాళ్లు ఎప్పటికీ మారరు. అందుకే ఈ జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. దీనికి భర్త కవిన్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవే కారణం. నా వివాహం విఫలమైంది. దయచేసి నన్ను క్షమించండి. అమ్మా, నాన్న.’’ అంటూ రిధన్య ఆడియో సందేశంలో ఆవేదన తెలియజేసింది. బిడ్డ మాటలు విన్న పేరెంట్స్ ఆవేదన చెందారు. అత్తారింట్లో ఎంత నరకం అనుభవించి ఉంటుందని కన్నీరుమున్నీరు అయ్యారు.
రిధన్య కారులో ఆలయానికి వెళ్తుండగా మార్గమధ్యలో పురుగుల ముందు తాగి ప్రాణాలు తీసుకుంది. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి రిధన్య వాట్సాప్ రికార్డుల ప్రకారం.. భర్త, అత్తామామలను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!