Tamil Nadu: వేధింపులు భరించలేకపోతున్నా.. తండ్రికి మెసేజ్ పెట్టి తనువు చాలించిన నవ వధువు
- తమిళనాడులో ఘోరం
- వేధింపులు భరించలేకపోతున్నాను
- తండ్రికి మెసేజ్ పెట్టి తనువు చాలించిన నవ వధువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరకట్న పిశాచికి మరో అబల బలైపోయింది. కూతురు జీవితం సుఖంగా ఉండాలని భారీగా కట్న, కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిపించాడు ఆ తండ్రి. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. పెళ్లైన దగ్గర నుంచి భర్త, అత్తమామలు నిత్యం వరకట్న వేధింపులు చేస్తూనే ఉన్నారు. అటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. ఇటు మనసు చంపుకుని బ్రతకలేక నవ వధువు తనువు చాలించింది. ఈ ఘోర విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: AP BJP Chief : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్న పీవీఎన్ మాధవ్..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
రిధన్య (27), వస్త్ర కంపెనీ యజమాని అన్నాదురై కుమార్తె. ఈ ఏడాది ఏప్రిల్‌లో కవిన్‌కుమార్(28) అనే యువకుడికిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారం, రూ.70లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. అంతేకాకుండా గ్రాండ్‌గా తిరుప్పూర్‌లో వివాహం జరిపించారు. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. నిత్యం భర్త, అత్తమామలు వరకట్నం కోసం రిధన్యను వేధిస్తూనే ఉన్నారు.
ఇది కూడా చదవండి: Blast : పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు.. 5గురు మృతి
ఇక అత్తింటి వారి వేధింపులు భరించలేక రిధన్య కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆదివారం మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. మార్గమధ్యలో కారు ఆపి పురుగుల మందు సేవించింది. చాలా సేపు కారు ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా రిధన్య నోటి నుంచి నురగ రావడం చూశారు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా ఆమె అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.
ఇక చనిపోయే ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్ మెసేజ్‌లు పెట్టింది. ఏడు ఆడియో సందేశాలను పంపించింది. తన నిర్ణయానికి క్షమాపణలు చెబుతున్నా.. నిత్యం అత్త గారింట్లో వేధింపులు భరించలేకపోతున్నాను.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. రోజూ మానసిక హింసను భరించలేకపోతున్నానని.. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సందేశంలో పేర్కొంది. ‘‘నా జీవితాంతం మీకు భారంగా ఉండాలనుకోవడం లేదు. ఈసారి నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నేను ఈ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను.’’ అని రిధన్య మెసేజ్‌లో స్పష్టం చేసింది.
రిధన్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వెలుపల ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవిలను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!