Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newly Married Bride Left The Wedding Ceremony In Uttar Pradesh: అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మూడు ముళ్లు పడగానే.. నవ వధువు వెంటనే పెళ్లి పీటలపై నుంచి వెళ్లి వెళ్లిపోయింది. ఏడడుగులు వేయించడానికి అందరూ సిద్ధమవుతున్న తరుణంలో.. ఆ వధువు పెళ్లి పీటలు దిగి, కంగారుగా పరుగెత్తింది. అది చూసి.. పెళ్లికొడుకుతో పాటు ఆ పెళ్లికి విచ్చేసిన అతిథులందరూ షాకయ్యారు. అసలేం జరుగుతోందంటూ ఆందోళన చెందారు. అయితే.. ఆ తర్వాత అసలు విషయం అందరూ శాంతించారు. ఆ వధువు చేసిన పనికి మెచ్చుకొని, ఆమెను శభాష్ అంటూ కొనియాడారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
Botsa Satyanarayana: పారదర్శకంగా బదిలీ చేస్తాం.. తర్వాత ప్రమోషన్లు ఇస్తాం
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఝూన్సీ జిల్లాలోని డోంగ్రీ ప్రాంతంలో కృష్ణ రాజ్‌పుత్ అనే అమ్మాయికి, యశ్‌పాల్ సింగ్ అనే కుర్రాడితో పెళ్ళి ఖరారు చేసింది. నిశ్చితార్థం ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు.. మే 16వ తేదీన వారి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి కోసం.. మే 15వ తేదీనే వరుడు, అతని కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. 16వ తేదీన గ్రాండ్‌గా పెళ్లివేడుకని నిర్వహించారు. వరుడు, వధువుని తయారు చేసి.. పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. వధువు మెడలో వరుడు మూడు ముళ్లు కూడా వేశాడు. ఇక ఏడడుగులే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో.. వధువు ఒక్కసారిగా పెళ్లి పీటలు దిగి పరుగు లంకించింది. దీంతో.. వరుడుతో పాటు బంధుమిత్రులు, అతిథులు కంగారు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. అప్పుడు వధువు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ముందుకొచ్చి.. అసలు నిజం బయటపెట్టాడు. వధువు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోందని, పరీక్షకు హాజరయ్యేందుకు ఆమె అలా వెళ్లిందని చెప్పాడు.
బికినీలో బ్యాక్ చూపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. బాలయ్య, నాగ్ లతో నటించింది కూడా ?
నిజానికి.. ముందుగా వేసిన షెడ్యూల్ ప్రకారం ఆ అమ్మాయి పరీక్ష మే 4వ తేదీన అయిపోవాల్సింది. అయితే.. ఆ సమయంలో అక్కడ ఎన్నికలు నిర్వహించడంతో, పరీక్షను మే 16వ తేదీక వాయిదా వేశారు. అదే రోజు పెళ్లి కూడా నిర్ణయించడంతో.. ఆ అమ్మాయి కన్ఫ్యూజన్‌లో పడిపోయింది. చివరికి పరీక్ష రాయాలని నిర్ణయించుకొని, తానను పరీక్షకు తప్పకుండా హాజరు అవుతానని కాలేజ్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడింది. అందుకే.. మూడు ముళ్లు పడిన వెంటనే, ఆ యువతి అలా పెళ్లి పీటలు దిగి వెళ్లిపోయిందని తేలింది. ఈ విషయం తెలిసి.. వరుడు, అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే.. ఆ అమ్మాయి మంచి పని చేసిందని కొనియాడారు.
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!