New UPI Guidelines: రేపటి నుంచి ఆగస్ట్ నెల ప్రారంభం కాబోతుంది. ప్రతీ నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన రూల్స్ మారబోతున్నాయి. ఇది సామాన్యుల జేబుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్, ఎల్పీజీ ధరల నియమాలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే, ఈసారి కేంద్ర ప్రభుత్వం యూపీఐ సేవల విషయంలో కూడా అనేక మార్పులు చేసింది. ఆగస్టు నెల నుంచి ఏ నియమాలు మారుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
Read Also: Mahabubabad: ఇంట్లో నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు
UPI కొత్త రూల్స్..
ఆగస్టు 1వ తేదీ నుంచి UPIకి సంబంధించి అనేక కొత్త నియమాలు అమలు కాబోతున్నాయి. మీరు PhonePe, G Pay, Paytm లను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే, మెరుగైన చెల్లింపు సౌకర్యాలను అందించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనేక నియమాలను మార్చింది. ఇందులో భాగంగా NPCI కొన్ని కొత్త పరిమితులను సైతం విధించింది. ఇది మీ చెల్లింపులను ప్రభావితం చేయదు.. కానీ, బ్యాలెన్స్ చెక్, స్టేటస్ రిఫ్రెష్, ఇతర విషయాలపై ఆంక్షలను విధిస్తుంది.
అయితే, ఆగస్టు 1వ తేదీ నుంచి UPI యాప్ నుంచి ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే తనిఖీ చేయగలరు. నెట్‌ఫ్లిక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదాల లాంటి ఆటోపే లావాదేవీలు ఇప్పుడు కేవలం 3 టైమ్ స్లాట్‌లలో ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు.. అలాగే, రాత్రి 9.30 తర్వాత.. మీరు ఒక రోజులో 3 సార్లు మాత్రమే విఫలమైన లావాదేవీల స్థితిని తనిఖీ చేసే వీలుంటుంది. ప్రతి చెకింగ్ కు మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉంటుంది.
Read Also: Tollywood : టాలీవుడ్ విలన్ బోరబండ భాను అకాల మరణం – ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
క్రెడిట్ కార్డు రూల్స్
మీరు ఎస్బీఐ కార్డ్ హోల్డర్ అయితే, మీకు బిగ్ షాక్ అని చెప్పాలి.. ఎందుకంటే ఆగస్టు 11వ తేదీ నుంచి, SBI అనేక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందుబాటులో ఉన్న ఉచిత విమాన ప్రమాద బీమా కవర్‌ను నిలిపివేయబోతుంది. ఇప్పటి వరకు, SBI, UCO బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, PSB, కరూర్ వైశ్య బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లతో కలిసి కొన్ని ELITE, PRIME కార్డులపై రూ. 1 కోటి లేదా రూ. 50 లక్షల వరకు బీమా కవర్‌ను అందించేది.