తెలుగు ఇండస్ట్రీలో గుర్తించదగిన విలన్ నటుల్లో ఒకరైన బోరబండ భాను అకాలంగా మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. విలన్ గ్యాంగ్‌లో సహనటుడిగా అనేక చిత్రాల్లో కనిపించి తనదైన హాస్య నటన తో గుర్తింపు పొందిన భాను, అకస్మాత్తుగా మరణించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శోకంలో మునిగిపోయారు.
Alos Read : Coolie : ప్రమోషన్స్ అంటే ఇదే.. ‘కూలీ’ టీం వినూత్న ప్రయత్నం..
బోరబండ భాను, గండికోట ప్రాంతానికి ఓ మిత్రుడి ఆహ్వానంతో వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకుని తిరుగు ప్రయాణంలో బొత్కూర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలంలోనే భాను మృతి చెందారు. ఈ సంఘటనకు ముందు కొన్ని గంటలకే “గండిపేట వచ్చా.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా” అంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మరింత కంటతడి పెట్టిస్తోంది. భాను పాత్రలు నెగటివ్ షేడ్స్‌లో ఉన్నప్పటికీ, ఆయన స్వభావం సన్నిహితుల్లో చాలా సరదాగా ఉండేదని, అందరితో కలివిడిగా ఉండే వ్యక్తిత్వం కలవాడని పలువురు సహచరులు భావోద్వేగంగా స్పందించారు.. ‘నవ్వుతూ చచ్చిపోయాడు భాను!’ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు భాను కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. భాను మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో మరో నటుడిని కోల్పోయింది.