UP Assembly: అసెంబ్లీలో కొత్త రూల్స్.. పేపర్లు చింపరాదు, ఫోన్లు తీసుకురాకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Assembly: అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు తమతోపాటు అసెంబ్లీలోకి ఏవైనా తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఇతరులకు అనుమతి ఉండదు. కానీ ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు సైతం తమ ఫోన్లను లోనికి తీసుకెళ్లడానికి వీల్లేదు. అదేంటీ ఎక్కడ ఇటువంటి రూల్ ఉంది? అని అనుకుంటున్నారా? కొత్తగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ రూల్‌ను తీసుకురానున్నారు. వీటితోపాటు మరికొన్ని కొత్త నిబంధనలను కూడా రూపొందించారు. వాటిపై నేడు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన తరువాత వాటిని అమలు చేయనున్నారు.
Read also: YSRCP on No Confidence Motion: కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు ఎటువంటి పేపర్లను తమతోపాటు లోనికి తీసుకెళ్లకూడదు. అసెంబ్లీలోకి సెల్ఫోన్లను సైతం అనుమతించరు. అసెంబ్లీలో బిగ్గరగా నవ్వరాదని.. సభలో ఎటువంటి పత్రాలు చించకూడదు. స్పీకర్‌కు వెన్ను చూపేలా నిల్చోవడం లేదా కూర్చోవడం చేయకూడదు. ఇటువంటి కొత్త నిబంధనలు ఇకపై బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా అమలు కానుంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ విధివిధానాలు, సభలో ప్రవర్తనకు సంబంధించిన కొత్త నియమాల బిల్లు- 2023ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై నేడు చర్చ జరిపిన తర్వాత ఈ బిల్లును ఆమోదించనున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం శాసనసభ్యులు సభలో ఎలాంటి పత్రాలను చించే వీలుండదు. సభలో వారు మాట్లాడుతున్నప్పుడు గ్యాలరీలో ఎవరి వైపు చూడటం చేయకూడదు. సభ్యులు వంగి స్పీకర్ స్థానాన్ని గౌరవించాలి. ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించేటప్పుడు, మరియు బయటకు వెళ్లేటప్పుడు లేదా కూర్చున్నప్పుడు, వారి సీట్ల నుంచి లేచేప్పుడు స్పీకర్‌కు వీపు చూపకూడదు. సభలోకి ఆయుధాలు తీసుకురావడం లేదా ప్రదర్శించడం నిషేధం. సభ్యులు లాబీలో పొగతాగరాదు. బిగ్గరగా మాట్లాడటం లేదా నవ్వడం చేయకూడదు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను 14 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించనున్నట్టు తెలిసింది. సభ్యులు ఎటువంటి సాహిత్యం, ప్రశ్నాపత్రం, పుస్తకం లేదా పత్రికా వ్యాఖ్యలను సభలోకి తీసుకురాకూడదని కొత్త నిబంధనల్లో రూపొందించారు.
Also Read
తాజావార్తలు
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు
-
US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!