కస్టమర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేసింది. ఎస్‌బీఐ డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. పెంచిన కొత్త ఛార్జీలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
Business Payments via Cards : వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారులకు భారతదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వీసా, మాస్టర్ కార్డ్‌లపై చర్యలు తీసుకుంటూ కార్డుల ద్వారా వ్యాపార చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది.
Decreasing use of debit cards: క్యాష్ లెస్ లావాదేవీల వైపు దేశం పరుగుపెడుతోంది. గతంలో పోలిస్తే కొన్నేళ్లుగా నగదు వినియోగం తగ్గిపోయి అంతా యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)కు అలవాటు పడ్డారు. రూపాయి దగ్గర నుంచి లక్షల వరకు లావాదేవీలన్నీ ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా జరుగుతున్నాయి. చివరు ఏటీఎంలలో కూడా నగదు తీసుకోవడానికి కార్డు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు వాడడం సర్వసాధారణమైపోయింది. క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డులకు సంబంధించి జులై 1 నుంచి ఆర్‌బీఐ కొన్ని కొత్త నియమాలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్నింటి గడువును అక్టోబర్ 1 వరకు పొడిగించింది.