దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కొవిడ్ స్ట్రెయిన్ కొత్త రకం లక్షణాలతో విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కనిపిస్తున్నలక్షణాలు, పూర్వపు కొవిడ్ లక్షణాలకు భిన్నంగా ఉంటున్నాయని గుర్తించారు. కడుపు నొప్పి, తల తిరగడం, వాంతులు, జలుబు వంటి లక్షణాలు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో బాధితులకు కీళ్ల నొప్పులు, మైయాల్జియా, జీర్ణ సంబంధ సమస్యలు, ఆకలి కోల్పోవడం వంటి లక్షణాలు బయటపడ్డాయి. చాలా మందిలో కళ్లు ఎర్రబడడం, నీరు కారే పింక్ ఐస్ లక్షణం కనిపించాయి. కొంత మందిలో చెవుల్లో గంట మోగుతుంది శబ్దం వినిపిస్తున్న లక్షణం కనిపించింది. మరికొందరిలో డయేరియాలో కనిపించే వాంతులు, విరేచనాలు బయటపడ్డాయి. ఊపిరితిత్తుల మీద దాడి చేసే కొవిడ్ వైరస్ మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. విరేచనాలు లాంటి లక్షణాలను కూడా కొవిడ్ లక్షణాలుగానే అనుమానించాలంటున్నారు వైద్యులు. చాలా మందిలో నీరసం, తీవ్ర ఇన్‌ఫెక్షన్ సమయాల్లో నిస్సత్తువ వంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.