మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజక వర్గానికి ఈనెల 13వ తేదీన ఓటింగ్ ఉన్నందున అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అందుకోసం మొత్తం 29,720 ఓటర్లకు గాను 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా 11 అదనపు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 29,720 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 15,472, స్త్రీలు 14,246, ఇతరులు 2 ఓట్లు ఉన్నాయి. ఏర్పాటు చేసిన 137 పోలింగ్ స్టేషన్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల్ 11, నారాయణ పేట్ 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ 18, మేడ్చల్ మల్కాజ్ గిరి 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. హైదరాబాద్ జిల్లాలో 22 చేసిన పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
Also Read : DK Aruna : బండి సంజయ్ వ్యాఖ్యల్లో తప్పు లేదు.. అది తెలంగాణలోని ఓ నానుడి
ఎన్నికల నిర్వహణకు 739 పోలింగ్ సిబ్బంది నియామకం
మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు 739 పోలింగ్ అధికారులు, సిబ్బంది ని నియమించారు . మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు కాగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 137 పి.ఓ లు, 137 ఏ.పి.ఓ లు, 319 ఇతర పోలింగ్ సిబ్బంది ని నియమించారు. మొత్తం 593 మంది సిబ్బందిని నియమించగా అందులో 146 మంది రిజర్వ్ గా నియమించారు. అందులో 29 మంది పి.ఓ లు, ఏ.పి ఓ లు 30, పోలింగ్ పర్సనల్ 87 మంది రిజర్వ్ గా ఉన్నారు.
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్
ఈ నెల 13 జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ ను తీసుకొని పోవడానికి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు నియమించబడిన పోలింగ్ అధికారులు, సిబ్బంది 12వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు రాగలరు. రిసెప్షన్ సెంటర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 12 మంది సెక్ట్రోల్ అధికారుల ను నియమించినట్లు అధికారులు పేర్కొన్నారు.