Nepal Protest: పాకిస్తాన్ నుంచి నేపాల్ వరకు.. భారత్ చుట్టూ అశాంతి..
- భారత్ తప్పా అన్ని చుట్టూ అన్ని దేశాల్లో హింస..
- తాజాగా నేపాల్‌లో ఆందోళనలు, ప్రధాని రాజీనామా..
- గతంలో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
నేపాల్:
నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోంది. ఈ నిరసనలు హింసాత్మక అల్లర్లుగా మారాయి. ఆ దేశ సుప్రీంకోర్టు, పార్లమెంట్‌తో సహా అధ్యక్షుడు, ప్రధాని నివాసాలను చుట్టుముట్టి దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 20 మంది ఆందోళనకారులు మరణించారు. చివరకు అల్లర్లతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది, దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
బంగ్లాదేశ్:
2024 బంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్ హసీనాను గద్దె దించేందుకు విద్యార్థులు పెద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుమట్టడంతో ఆమె భారతదేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ఈ అల్లర్లను పూర్తిగా మతోన్మాద శక్తులు ఆధీనంలోకి తీసుకున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత, హిందువులతో పాటు మైనారిటీలపై పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలను రాడికల్ ఇస్లామిస్టులు తగలబెట్టారు.
శ్రీలంక:
2022లో ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం వదిలి పారిపోయేలా చేసింది. నేపాల్ మాదిరిగానే ఈ దేశంలో కూడా యువత నేతృత్వంలో ఉద్యమాలు జరిగాయి. అధ్యక్షుడు ఇంట్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు అందినకాడికి దోచుకెళ్లారు. ఇదే విధంగా నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగాయి.
పాకిస్తాన్:
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అనేది బయటకు కనిపిస్తుంది, అంతా ఆర్మీ రాజ్యమే నడుస్తుంది. అందరికి తెలిసిన సత్యం. అయితే, దీనిని మార్చాలని భావించిన ఇమ్రాన్ ఖాన్‌ను 2022లో అవిశ్వాస తీర్మానంతో గద్దె దించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి ఆర్మీ ఈ నిరసనల్ని అణిచివేస్తోంది.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!